256 ఏళ్లు బ్రతికిన ఆయుర్వేద వైద్యుడు..ఎలాగో తెలిస్తే మీరు బతకొచ్చు!

A ayurveda doctor live 256 years in China

03:18 PM ON 25th June, 2016 By Mirchi Vilas

A ayurveda doctor live 256 years in China

ఒకప్పుడు మనుషులు 100, 120 ఏళ్లు బతికే వారు. ఇప్పుడున్న కాలంలో 80 ఏళ్లు బతికితేనే ఎక్కువ అనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు 100 ఏళ్లకు పైగా బతికారంటే గొప్పనే చెప్పాలి. కానీ, చైనాలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా 256 ఏళ్లు బతికాడు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజమని చెబుతున్నారు అక్కడివారు. అంతేకాదు, అతనికి 24 మంది భార్యలు, 200 మందికి పైగా పిల్లలు ఉన్నారట. ఆ వైద్యుడు గురించి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. ఆయన మరణించినప్పటికి అతని వయస్సు 256 ఏళ్లట.

అన్నేళ్లు బతకడం చరిత్రలోనే తొలిసారి జరిగిన సంఘటన. సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ల వయస్సులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ.. అనేక ప్రాంతాల్లో తిరిగాడు. ఆయుర్వేద వైద్యుడిగా అనేక చోట్ల కాలం వెళ్లదీసి 72 ఏళ్ల వయస్సులో కై క్సియన్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మంచి ఆహారంతో పాటు ఔషధాలు, రైస్ వైన్ తీసుకునేవాడు. కాగా, 1749లో ఆర్మీలో చేరి మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా.. సలహాదారుగా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1927లో లీ చింగ్ ను తిరిగి ఆయన స్వస్థలానికి పిలిపించారు. అప్పటికీ ఆయనకు 24 మంది భార్యలు.. 200 మందికి పైగా పిల్లలు ఉన్నారు.

ఆయన కుటుంబంలో 11 తరాలను చూశాడు. చివరికి 1933లో అతను కాలం వెళ్లదీసాడు. అయితే ఆయన వయస్సుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. లీ చింగ్ తాను 1736లో జన్మించాడని స్వయంగా చెప్పాడట. అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం లీ చింగ్ 1677లో జన్మించాడని అంటున్నారు. 1930లో 'న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన కథనం ప్రకారం చైనా ప్రభుత్వం రికార్డుల్లో 1827లో లీ చింగ్ కు 150వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. 1877లో 200వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాడు.

ఆ రెండు కథనాల ప్రకారం లీ చింగ్ 197 ఏళ్లు లేదా 256 ఏళ్లు జీవించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇన్నేళ్లు జీవించడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఫ్రెంచ్ కి చెందిన ఓ మహిళ 122 ఏళ్లు జీవించి అత్యధిక వయస్సున్న మనిషిగా రికార్డు సృష్టించింది. ఆమె కంటే ఈ చైనీయుడు రెండింతలకు పైగానే బతికాడన్నమాట. అయితే ఇదంతా సమర్థవంతమైన ఆహార నియమాలు, శరీరక శ్రమ, భౌతిక, మానసిక ఆరోగ్యం అంశాలపై జీవనకాల పరిమతి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

English summary

A ayurveda doctor live 256 years in China