ఈ ఎకో బాబా ఏం చేసాడో తెలిస్తే.. అవాక్కవుతాం!

A baba cleaned 160 km river

11:12 AM ON 1st August, 2016 By Mirchi Vilas

A baba cleaned 160 km river

ఏదీ కూడా మొదలు పెట్టేముందు ఎవరూ కనిపించరు. ఎవరూ రారు. పైగా హేళన చేస్తారు. కానీ సమాజ హితం కోసం ఎవరైనా ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకుంటే అది ఓ చిన్న ప్రయత్నంతోనే మొదలవుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి. నాకెందుకులే అని ఊరుకుంటే ఎవరూ ఏదీ చేయలేరు. సరిగ్గా ఇదే తరహా ఆలోచనతో అతను ఒక్కడే కదిలాడు. ఎన్నో కిలోమీటర్ల పొడవున్న నదిని ఒంటి చేత్తో శుభ్రం చేశాడు. ఆ ప్రయత్నంలో అతనికి వాలంటీర్లు కూడా లభించి, కలిసివచ్చారు. ఇంక అనుకున్న దాని కంటే ముందుగానే తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకుని సమాజం కోసం, పర్యావరణం కోసం ఉపయోగపడే గొప్ప పని పూర్తి చేశాడు. అతనే సంత్ బల్ బీర్ సింగ్ సీచేవాల్. అందరూ అతన్ని ఎకో-బాబా అని పిలుస్తారు. ఎందుకంటే అతను పర్యావరణంపై చూపించే మక్కువ మామూలుది కాదు కనుక. అతను చేసిన పని గురించి తెలుసుకోడానికి వివరాల్లోకి వెళ్దాం..

1/5 Pages

పంజాబ్ లోని కాలి బెయిన్ అనే పేరున్న160 కిలోమీటర్ల పొడవైన ఓ చారిత్రాత్మకమైన నది గుర్రపు డెక్క వంటి కాలుష్య పూరిత మొక్కలతో, వ్యర్థాలతో నిండిపోయింది. అసహ్యంగా తయారైంది. ఈ క్రమంలో బల్ బీర్ సింగ్ ఆ నదిని చూసి ఎలాగోలా శుభ్రం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నది శుభ్రత కార్యక్రమం మొదలు పెట్టాడు. అయితే అతనికి తోడుగా మరి కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాలంటీర్లుగా సేవలు అందించారు. దీంతో కొద్ది రోజుల్లోనే ఆ నది మొత్తం క్లీన్ అయింది. అయితే వారు అంతటితో ఆగలేదు. నది పరివాహక ప్రాంతం పొడవునా పూలమొక్కలు, చెట్లను నాటారు. అనువుగా ఉన్న చోట దిగేందుకు మెట్లను, పార్కుల లాంటి ప్రదేశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ నది చుట్టూ ఉన్న అనేక గ్రామాల్లో ఇప్పుడు నీటి సమస్య లేనే లేదట. దటీజ్ ఎకో బాబా అంటూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నెటిజన్లు ఎకో బాబాను పొగుడుతూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.

English summary

A baba cleaned 160 km river