అద్భుతం: ఈ పాప రెండు సార్లు పుట్టింది(వీడియో)

A baby born 2 times

04:40 PM ON 27th October, 2016 By Mirchi Vilas

A baby born 2 times

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా మరో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే, ఏ తల్లైనా బిడ్డకు ఒక్కసారే జన్మనిస్తుంది. ఈ తల్లి కూడా అలాగే జన్మనిచ్చింది. కానీ ఆ పాప రెండు సార్లు పుట్టింది. బాప్ రే ఇదేమిటి అనుకుంటున్నారా? మరి ఇలాంటి సందేహం కలగడం సహజం. కానీ ఇది నిజం. టెక్సాస్ లోని చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఈ అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఈ ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్స చేస్తున్న వైద్యులకు ఆమె కడుపులో ఉన్న బిడ్డ ట్యూమర్ తో పాటు పెరిగినట్లు గుర్తించారు.

దీంతో బిడ్డ కడుపులో ఉండగానే పిండాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్ ను తొలగించారు. ట్యూమర్ వల్ల దాదాపు బిడ్డ గుండె ఆగినంత పనయింది. ఆ సమయంలో బిడ్డను బయటకు తీస్తే ప్రాణాలకే ప్రమాదమని మళ్లీ ఆ పిండాన్ని గర్భాశయంలోకి పంపించారు. 36 వారాల తర్వాత ఆమెకు చికిత్స చేసి బిడ్డను తల్లి కడుపులో నుంచి బయటకు తీశారు. ఈ అరుదైన చికిత్సకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. వైద్యుల శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆ పాప ముద్దులొలికిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఆ అరుదైన ఘటనపై మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

A baby born 2 times