ప్రతీ ఒక్కరి మనసుని కదిలించే సంఘటన(వీడియో)

A baby crying in front of her mother body

11:42 AM ON 28th September, 2016 By Mirchi Vilas

A baby crying in front of her mother body

కొన్ని ఘటనలు మనసుని కలచి వేస్తాయి. గుండెల్ని పిండేస్తాయి. సరిగ్గా అమెరికాలోని మశాచుసెట్స్ లో జరిగిన ఓ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇంతకీ అదేంటంటే, అపస్మారక స్థితిలో తల్లి కింద పడిపోయింది. రెండు సంవత్సరాల వయసున్న ఆమె కూతురు తన తల్లిని లేపే ప్రయత్నం చేసింది. ఆమెను పట్టుకుని ఏడుస్తూ లేవమంటూ ఆ చిన్నారి చేసిన ప్రయత్నమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడు ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తూ జనాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఆ చిన్నారి పడిన వేదన చూడండి. అమెరికాలోని మశాచుసెట్స్ లో 36 సంవత్సరాల వయసున్న మహిళ తన రెండేళ్ల కూతురితో కలిసి లారెన్స్ లోని ఫ్యామిలీ డాలర్ స్టోర్ కు షాపింగ్ కు వెళ్లింది.

అయితే పాశ్చాత్య దేశాల్లో డ్రగ్ వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మహిళ షాపింగ్ కు వస్తూ డ్రగ్ తీసుకుంది. ఓవర్ డోస్ కావడంతో అపస్మారక స్థితిలో షాపింగ్ మాల్ లో కళ్లు తిరిగి పడిపోయింది. తన తల్లి ఏ స్థితిలో ఉందో తెలియని ఆ రెండేళ్ల పసి మనసు తల్లడిల్లింది. అమ్మను లేపడానికి చాలా ప్రయత్నించింది. వెక్కివెక్కి ఏడ్చింది. పాప ఏడుపు విన్న పోలీస్ వెళ్లి చూశాడు. వెంటనే 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని శిశు సంరక్షణ శాఖ అధికారులు తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: టీనేజ్ లోనే తెల్ల జుట్టు వచ్చినవారు అస్సలు చెయ్యకూడని తప్పులు!

ఇది కూడా చదవండి: తులసి నీళ్లలో పసుపు కలుపుకుని తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు!

ఇది కూడా చదవండి: భర్త కువైట్ లో ఉంటే ఊళ్ళో భార్య ఏం చేసిందో తెలుసా?

English summary

A baby crying in front of her mother body. A mother taken drugs and came to shopping mall. But she is over dosed with drugs and fallen with unconcious.