అద్భుతం: తల్లి చనిపోయినా కడుపులో బిడ్డ బ్రతికాడు

A baby safe in womb after his mother was died

05:44 PM ON 17th May, 2016 By Mirchi Vilas

A baby safe in womb after his mother was died

అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు.. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరము లేదు.. నిజమే ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో ఎవరికీ తెలీదు. జరిగిన తరువాత అద్భుతం జరిగిందని ఆశ్చర్యపోతూ గొప్పగా చెప్పుకోవడం తప్ప.. తాజాగా వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. వాళ్ళు కూడా ఇలాంటి అద్భుతం జరుగుతుందని గుర్తించలేదు, జరిగిన తరువాత అద్భుతం అని చెప్తున్నారు.. ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే... ముస్సోరికి సమీపంలో మాటా రైడర్, సారా ఇల్లర్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. గర్భంతో ఉన్న సారాకి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు భర్త మాటా రైడర్.

అయితే.. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ ట్రాక్టర్ దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సారాకి తీవ్ర గాయాలయ్యాయి, మాటా రైడర్ పక్కటెముకలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డాక్టర్లు సంఘటన స్థలానికే వచ్చి ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. తీవ్ర గాయాలపాలైన సారా మార్గ మధ్యలోనే చనిపోయింది. అయితే ఆమె కడుపులో ఉన్న చిన్నారిని మాత్రం సురక్షితంగా బయటకు తీయగలిగారు అమెరికన్ డాక్టర్లు. తల్లి చనిపోవడంతో చిన్నారికి శ్వాస అందడం కష్టమే అని అందరు భావించినా.. వెంటనే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు చిన్నారిని ఈ లోకంలోకి తీసుకురాగలిగారు.

చనిపోయిన తల్లిని చూసి బాధపడాలో.. చిన్నారి క్షేమంగా కళ్లు తెరిచిందని సంతోషించాలో.. అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ చిన్నారి కుటుంబ సభ్యులు. వెంటిలేటర్ పై చిన్నారికి చికిత్స అందించగా, నాలుగో రోజు ఆ చిన్నారి కళ్లు తెరవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారికి మాడిసన్ అనే పేరు పెట్టారు.

English summary

A baby safe in womb after his mother was died