దారుణం.. బాల్ తగిలిందని చంపేశారు!

A ball killed a man in Delhi

10:09 AM ON 26th March, 2016 By Mirchi Vilas

A ball killed a man in Delhi

ఇదేమిటి అనుకుంటున్నారా...? నిజం... ఎక్కడంటే మన దేశ రాజధాని డిల్లీలో... జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓసారి వివరాల్లోకి వెళ్తే, బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో భార‌త్ నెగ్గిన తీరుతో ఓ వైద్యుడు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. ఆ ఆనందంలో త‌న కుమారుడితో క‌లిసి క్రికెట్ ఆడాడు. డాక్టర్ గారు కొట్టిన ఓ బంతి ఆ దారి వెంట వెళుతున్న ఇద్ద‌రికి త‌గిలింది. దీంతో పెద్ద‌రికంగా వెళ్లి వాళ్లకు డాక్ట‌ర్‌ సారీ చెప్పాడు. దాంతో వాళ్ళు సరేనంటూ వెళ్ళిపోయారు. అయితే కొద్దిసేప‌టికే మ‌రికొంద‌రితో క‌లిసొచ్చిన వారిద్దరూ డాక్టర్ ని ఇంట్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. బేస్ బాల్ బ్యాట్లు, ఇనుప రాడ్ల‌ను వారు ఉప‌యోగించారు. అడ్డొచ్చిన వారినీ చిత‌క‌బాదేశారు.

మందేసి చిందేసి పోలీసులకు దొరికిపోయిన నవదీప్

ఆ డాక్ట‌ర్ పేరు పంక‌జ్ నారంగ్. ఆయ‌న‌కు భార్య, ఎనిమిదేళ్ళ కుమారుడు ఉన్నారు. డాక్ట‌ర్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఎనిమిది మందిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇందులో న‌లుగురు బాలుర‌ట‌. క్రైమ్ రేటు ఎలా పెరిగిపోతోందో... అన్నట్టు ఓ విషయం... క్షమాపణ చెప్తే ఊరుకోవడం ఒక‌ప్పటి మాట. సారీ విని వెళ్ళిపోయి, తిరిగొచ్చి చంపేయ‌డం ఇప్పటి బాట. హత విధీ....

రేటు అడిగినందుకు రిపోర్టర్ చెంప పగలగొట్టింది

English summary

A ball killed a man in Delhi. 8 kids killed a doctor for ball in Delhi.