కొండ చిలువతో సెల్ఫీ.. సీన్ రివర్స్(వీడియో)

A boy attacked by a python while taking a selfie

04:51 PM ON 30th September, 2016 By Mirchi Vilas

A boy attacked by a python while taking a selfie

నిజంగా పిల్లలు చదువుకునే ఓ స్కూల్లోకి ఉన్నట్టుండి పెద్ద కొండచిలువ వచ్చింది. దీంతో దాన్ని చూసిన పిల్లలు, పెద్దలు అంతా హడావుడి చేశారు. పనిలోపనిగా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. అధికారులొచ్చి ఒడుపుగా కొండచిలువను పట్టుకున్నారు. ఇక్కడిదాకా బానే ఉంది. అయితే అక్కడున్న కొంత మందికుర్రాళ్లు కొండ చిలువతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేశారు. అసలే దొరికిపోయానన్న కోపంతోవున్న కొండచిలువకు కోపం వచ్చింది. దూరం నుంచి చూడు ఓకె.. కానీ నాతో సెల్ఫీ దిగాలనుకున్నావనుకో.. కరిచేస్తానంటూ ఒక్కసారిగా రివర్స్ అయింది. సెల్ఫీ దిగుతున్న కుర్రాణ్ని గాయపరిచింది. కొద్దిపాటి గాయాలలో కుర్రాడు బయటపడ్డాడు. చివరకు అటవీ అధికారులు వచ్చి కొండచిలువను పట్టుకెళ్లారు.

English summary

A boy attacked by a python while taking a selfie