డబ్బివ్వకుంటే కలిసున్న ఫోటోలు నెట్లో పెడతా

A Boy blackmails a teenage girl with photos

01:40 PM ON 20th April, 2016 By Mirchi Vilas

A Boy blackmails a teenage girl with photos

మహిళల పై అత్యాచారాలు, దాడులు, వేధింపులకు అంతూ పొంతూ ఉండడం లేదు. ఇక బ్లాక్ మెయిల్ సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వకుంటే మనిద్దరం ఏకాంతంగా ఉన్న ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెధిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాదులోని నేరేడ్‌మెట్ ప్రాంతంలో జరిగింది. నిందితుడి పేరు షేక్ నిజాముద్దీన్. అతనిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పాత సఫిల్‌గూడకు చెందిన నిజాముద్దీన్‌ అయిదేళ్ల క్రిందట ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్లాడు, ఉద్యోగం రాలేదు. కానీ అక్కడ పని చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది.

తాను అనాథనని చెప్పడంతో, ఆ యువతి అతని పట్ల సానుభూతి కనబర్చింది. అదే అదనుగా పరిచయం మరింత పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని ఏడాది క్రితం చెప్పాడు, బాధితురాలు కూడా అంగీకరించింది. ఇద్దరు కలిసి ఆమె బంధువుల ఇళ్లకు, సినిమాలకు వెళ్లేవారు. ఇరువురు కలిసి ఏకాంతంగా కూడా గడిపారు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు నిందితుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. మరో వైపు కొద్ది రోజుల క్రితం యువతి పెళ్లి గురించి అడిగింది. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతని పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మళ్లీ కనిపించవద్దని హెచ్చరించింది. దీంతో ఆమె పై అతను కక్ష పెంచుకున్నాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే మనిద్దరం కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు నెట్లో పెడతానని బెదిరించాడు. ఆమె బంధువులకు కొన్ని చిత్రాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.

English summary

A Boy blackmails a teenage girl with photos. A girl loved a cheater and she get together with that boy. At that time boy taken a photos and videos when she was with him. Now he is blackmailing that girl for money with that photos.