పాము తలని కొరికి చంపేశాడు.. ఎలాగో తెలిస్తే షాకౌతారు!

A boy cuts snake head with mouth

03:51 PM ON 9th September, 2016 By Mirchi Vilas

A boy cuts snake head with mouth

పాము మనిషిని కరవడం చూశాం... కానీ మనిషే పాము తలను కొరికి చంపిన ఘటన ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్ నగరంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న రఘువంశీ(28) ఇంట్లో నోరు తెరచి నిద్రపోతుండగా అడుగు పొడవు గల ఓ పాము అతని నోట్లో పడింది. దీంతో మంచి నిద్రలో ఉన్న రఘువంశీ నోట్లో పడిన పామును గట్టిగా కొరికాడు. అంతే పాము తల కాస్తా తెగిపోయి నోటి లోపలకు వెళ్లగా తల లేని పాము రక్తం స్రవిస్తూ గదిలో నేలపై పడింది. ఇదంతా గాఢ నిద్రలో ఉన్న రఘువంశీకి తెలియదు. ఇంతలో అతని తల్లి రాంప్యారీ కొడుకు గదిలోకి ప్రవేశించడంతో రఘువంశీ ముఖంపై రక్తం చారలు కనిపించాయి. గదిలో నేలపై తల లేని పాము రక్తం కారుతూ కనిపించింది.

విషయం గ్రహించిన తల్లి రఘువంశీని హుటాహుటిన పీర్ బాబా వద్దకు తీసుకువెళ్లగా అతను ఏదో పౌడరు తినమన్నాడు. ఆ పౌడరు తినగానే రఘువంశీకి వాంతులై గొంతులోనుంచి పాము తల బయటపడింది. పీర్ బాబా చెప్పడంతో ఆందోళన చెందిన రఘువంశీ ఆసుపత్రికి వెళ్లి యాంటీ వీనం ఇంజక్షన్ చేయించుకున్నాడు. తాను పామును కొరికి చంపానని రఘువంశీ చెప్పిన మాటలు విన్న డాక్టర్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించి రఘువంశీకి చికిత్స అందించామని డాక్టర్ తెలియజేశాడు. మొత్తంమీద రఘువంశీ పాము తలను కొరికి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇల్లు ఖాళీ చేయించడానికి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు(వీడియో)

ఇది కూడా చదవండి: మోడీ గారూ ఇదేం పాలన... కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

ఇది కూడా చదవండి: అమ్మాయిలతో చిందులేస్తూ అడ్డంగా దొరికేసిన వైసీపీ కార్యకర్తలు!

English summary

A boy cuts snake head with mouth. A boy cuts snake head while he is in sleep in Indore.