100 బుల్లెట్లను తనపై ఎక్కించుకుని ప్రాణంతో చెలగాటం చేసిన యువకుడు

A boy did adventure with 100 bullets

06:52 PM ON 29th August, 2016 By Mirchi Vilas

A boy did adventure with 100 bullets

అక్కడ పలువురు ప్రముఖులు, యువకులు, స్నేహితులు, కుటుంబసభ్యులు ఉండగానే అతని పొట్టమీది నుంచి ఒకటి రెండు కాదు ఏకంగా 100 బుల్లెట్లు దూసుకెళ్లాయి. బుల్లెట్లు అంటే పిస్తోలు బుల్లెట్లు కాదు. రాయల్ ఎన్ ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను తన పొట్ట మీదినుంచి నడిపించినా చలించలేదు. బులెట్ మీద మనిషితో కలిపి 280 కిలోల బరువు ఉంటుంది. ఇది కనికట్టు కాదు. ఇంద్రజాల ప్రదర్శన కాదు. నడిరోడ్డుపై జరిగిన ఈ కార్యక్రమం వెనుక రాజమహేంద్రవరానికి చెందిన కొమ్మ ఉజ్వల్ అనే యువకుని సాహసం వుంది. అయితే ఎందుకు ఈ సాహసం చేసాడంటే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో తన పేరు నమోదు చేయించుకోవాలన్న తపనతో ఇలా చేసాడు.

1/6 Pages

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధుల సూచన మేరకు, నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.రమేష్ కిషోర్, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా. రామకోటేశ్వరరావు, నగర పాలక సంస్ధ మెడికల్ ఆఫీసర్ డా.ఎం.వి.ఆర్.మూర్తి పర్యవేక్షణలో పుష్కర ఘాట్ దగ్గర నిర్వహించిన ఈ సాహస కృత్యం, ప్రత్యేకంగా శిక్షణ కలిగిన బుల్లెట్ రైడర్స్ సహకారంతో ఉజ్వల్ వైద్యులు, కరాటే శిక్షకుల పర్యవేక్షణలో సాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన జనం సమక్షంలో ఈ సాహస కృత్యాన్ని విజయవంతంగా నిర్వహించారు.

English summary

A boy did adventure with 100 bullets