నేపాల్ లో వింత: శిలగా మారుతున్న బాలుడు(ఫోటోలు)

A boy get skin disease in Nepal

10:50 AM ON 11th June, 2016 By Mirchi Vilas

A boy get skin disease in Nepal

ఇదేదో విఠలాచర్య సినిమాలో సీను కాదు... శాపంతో శిలగా మార్చేయడానికి... నిజంగా ఇదో వింతే... నేపాల్ లో ఓ బాలుడు విగ్రహంలా మారుతున్న ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. రమేశ్ దార్జి అనే 11 ఏళ్ల బాలుడి చర్మం క్రమక్రమంగా ఊడిపోతుంది. దాని స్థానంలో బాగా మందంగా నల్లగా ఉన్న చర్మం వస్తోంది. పుట్టుకతోనే వచ్చిన హార్లీక్వీన్ ఇచ్ఛియోసిస్(పొలుసులుగా ఏర్పడే చర్మవ్యాధి) అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. నేపాల్ లోని బగ్లంగ్ ప్రాంతంలో నివసించే నార్ కుమారి, నంద దంపతులకు రమేశ్ సంతానం.

రమేశ్ కు పుట్టుకతోనే జన్యుపరమైన లోపం వల్ల చర్మ సంబంధిత వ్యాధి వచ్చింది. పుట్టిన పదిహేను రోజుల తర్వాత రమేశ్ శరీరం నల్లగా మారిపోయింది. శిశువు ముఖం పై నల్లని పొలుసులు ఏర్పడ్డాయి. చర్మం గట్టిగా అయిపోయింది. దీంతో సమీపంలోని ఆసుపత్రిలోని వైద్యులకు రమేశ్ ను చూపిస్తే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని.. తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో రమేశ్ తల్లిదండ్రులు ఖాట్మండ్ మెడికల్ కళాశాల వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం రమేశ్ చర్మం పై ఉన్న నల్లటి పొలుసులు తీసేశారు. ఈ వ్యాధి నుంచి బాలుడు కోలుకోవడానికి రెండు వారాలకొకసారి యాంటీ బయోటిక్స్ ఇస్తున్నారు.

శరీరం పై ఉన్న నల్లటి చర్మాన్ని తొలగించేందుకు మాయిశ్చరైజర్ చేస్తున్నారు. బాలుడు ఎముకలు, కండరాలు బలహీనంగా ఉన్నందుకు ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి వల్ల రమేశ్ నడవలేకపోతున్నాడు. మాట్లాడటం కూడా చేతకావడం లేదు. పాఠశాలకు కూడా వెళ్లడం లేదు. నాలుగు గోడల మధ్యే కాలం వెల్లదీస్తున్నాడు. అదండీ సంగతి..

1/8 Pages

English summary

A boy get skin disease in Nepal