అమ్మాయి ఫోన్ దొరికిందని ఏం చేసాడో తెలుసా(వీడియో)

A boy harassed a girl techie with his messages

10:13 AM ON 21st May, 2016 By Mirchi Vilas

A boy harassed a girl techie with his messages

మాములుగా ఎవరిదైనా ఫోన్ దొరికితే ఎవరిదో తెలుసుకుని వాళ్లకి తిరిగిచ్చేస్తాం.. లేదా దొరికింది కదా అని జేబులో పెట్టేస్తాం. అయితే ఓ పోకిరి మాత్రం ఫోన్ దొరికింది కదా అని తన బుద్ధి చూపించాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హోటల్‌ లో సూపర్‌వైజర్‌ గా పనిచేస్తున్న సిద్ధూకి ఈనెల 4వ తేదీన ఒక మొబైల్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ఒక మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ది. దీంతో సిద్ధూ బుర్రలో వెధవ ఆలోచనలు పుట్టుకొచ్చాయి. అయితే తాను ఫోన్ పోగొట్టుకున్నానని ఆ మహిళ ఫోన్‌ చేయడంతో సిద్ధూ తన కోతి బుద్ధి చూపించాడు. ఆ రోజు నుంచి బూతు మెసేజ్‌లు, వీడియోలతో ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.

దీంతో సహనం కోల్పోయిన బాధితురాలు మాదాపూర్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. సిద్ధూ బాగోతం బయట పెట్టడంతో నిందితుడి పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. ఫోన్ లో ఎలా హెరాస్ చేసాడో ఈ కింద వీడియోలో మీరు కూడా చుడండి.

English summary

A boy harassed a girl techie with his messages