తీవ్రవాదిగా మారిన నాలుగేళ్ల బాలుడు

A Boy In England Writes Cooker Bomb Instead Of Cucumber faced terror warnings

12:39 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

A Boy In England Writes Cooker Bomb Instead Of Cucumber faced terror warnings

ప్రపంచంలో ఏమూల చూసినా తీవ్రవాదం పడగ విప్పుతోంది. చిన్న పిల్లలకు తీవ్ర వాద శిక్షణ ఇస్తున్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పలుదేశాల నేతలు పిలుపు నిస్తున్నారు. అయినా తీవ్రవాదానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాజాగా ఓ స్కూల్లో నాలుగేళ్ల బాలుడిని తీవ్రవాద ప్రేరేపిత బాలుడిగా పేర్కొంటూ, విచారణ చేసారు. తీరా అసలు విషయం తెల్సే సరికి మాటల్లో దొర్లిన తప్పు అని తేలింది. ఒక్కోసారి మాటల్లో తప్పులు దొర్లితే కొన్నిసార్లు అవి తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.ఇంగ్లాండ్‌లో ఓ చిన్నపిల్లాడి విషయంలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే, వచ్చీరాని మాటల్లో దొర్లిన చిన్న ఉచ్ఛారణ దోషంతో అతన్ని తీవ్రవాదని భయపడ్డారు స్కూల్‌ టీచర్లు. ఆ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.

ఇంగ్లాండ్‌లోకి లుటన్‌కి చెందిన నాలుగేళ్ల బాలుడు.. తన తండ్రి కూరగాయలు తరుగుతుండడం చూసి దోసకాయ.. కత్తి బొమ్మలను గీశాడు. దాన్ని తీసుకెళ్లి పాఠశాలలో తన స్నేహితులకు చూపిస్తూ.. ‘కుకుంబర్‌’ అని చెప్పకుండా ‘కుక్కర్‌ బాంబ్‌’ అని తప్పుగా ఉచ్ఛరించాడట. ఆ విషయం తెలుసుకున్న అక్కడి టీచర్లు..అతను నిజంగా బాంబు గురించే చెబుతున్నాడని అనుమానించారట. అతన్ని తీవ్రవాద ప్రేరేపిత బాలుడిగా భావించి వెంటనే అతని తల్లికి సమాచారం అందించారు.

పోలీసులు.. సామాజిక కార్యకర్తలు ఉన్న ఓ ప్యానెల్‌కి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ చిన్నారి తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు కౌన్సెలింగ్‌కి పంపించాలని వారు సూచించారు. అయితే.. చిన్నారి తల్లి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సరిగా పలకడం రాక.. తప్పుగా పలికాడని.. తను గానీ.. తన కుమారుడు గానీ.. తీవ్రవాదులం కాదని స్పష్టం చేసింది. అయినా.. పలు రకాలు విచారణ చేసిన తర్వాత చిన్నారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయించారట.

ఇంతకీ ఇంత చిన్న విషయానికే అంత రాద్ధాంతం చేయాలా అనుకోవచ్చు .. అయితే దీనికి ఓ కారణం ఉంది. గత ఏడాది నుంచి పాఠశాలల్లో విద్యార్థులు ఏ మాత్రం భిన్నంగా ప్రవర్తించినా.. మాటల్లో తేడా వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలన్న నిబంధన అక్కడ అమలులో కి తెచ్చారట. అందుకే టీచర్లు అలా చేశారట. ఓ అక్షరం తప్పు పలికినా, తప్పు రాసినా అర్ధం మారిపోయి అనర్ధం తెస్తుందని మరోసారి ఈ ఘటన తేటతెల్లం చేసింది.

English summary

A Small Scholl kid of 4 years of age spoke wrongly the name of Cucumber and said Cooker Bomb. And latesr he was considered as the terrorist and he and his family were interrogated by the local police.Actually that small kid pronounced mistakenly.This weird incident was occured in England