క్రికెట్ ఆడుతూ గొడవపడి ఫ్రెండ్ ను బ్యాట్ తో కొట్టాడు!

A boy killed his friend with bat while playing cricket

05:44 PM ON 25th June, 2016 By Mirchi Vilas

A boy killed his friend with bat while playing cricket

ఓ యువకుడు క్షణికావేశంలో క్రికెట్ బ్యాట్ తీసుకుని స్నేహితుడి తలపై బాదగా, అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఢిల్లీలోని సాగర్ పూర్ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడిని శివం (16)గా, నింధితుడిని ఆకాశ్(19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మినోరా కల్పి గ్రామంలో ఉంటున్న శివం 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులుతో గడిపేందుకు ఢిల్లీకి వచ్చాడు. గత బుధవారం స్నేహితులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. శివం స్నేహితుడు జరిగిన విషయాన్ని వెళ్లి అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు.

వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే శివం మరణించాడని అతని తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రికెట్ ఆడుతూ శివం, ఆకాశ్ గొడవపడ్డారని, ఆకాశ్ బ్యాట్ తో కొట్టగా శివం కుప్పకూలిపోయాడని వారి స్నేహితుడు అమిత్ చెప్పాడు. కాగా శివం తల్లి మాట్లాడుతూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, కుట్రపూరిత ఉద్దేశ్యముందని ఆరోపించింది. పోలీసులు మాత్రం క్రికెట్ గొడవే కారణమని చెప్తున్నారు.

English summary

A boy killed his friend with bat while playing cricket