ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కానీ వీరి మధ్య అనుకోని అతిధి రావడంతో...

A boy killed his lover for bad reason

05:54 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

A boy killed his lover for bad reason

వీరిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎంతలా అంటే ప్రేమకోసం ప్రాణాలిచ్చేంత ఇష్టం. ఒకరిని వదిలి ఒకరు క్షణం కూడా ఉండలేరు. అలా ఉండాల్సి వస్తే క్షణమో యుగంలా గడిపేవారు. రోజూ ఇంట్లో తెలియకుండా కలుసుకునే వారు. ఒకరి ప్రేమలో ఒకరు ముగ్దులయ్యారు. ఇంత ఆనందంగా సాగుతున్న వీరి ప్రేమ ప్రయాణంలోకి ఒక అనుకోని అతిథి వచ్చి చేరింది. ఆ అతిధి ఏంటా అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే... ముంబైలోని గోల్డెన్ ఓక్ లో నివాసముంటున్న కింజల్, మొరెగావ్ లోని ఏక్ వీర అపార్ట్ మెంట్ లో ఉండే దేవేంద్ర బోస్లే మధ్య పరిచయం ఏర్పడింది.

ఇద్దరి అభిరుచులు కలవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమకి దారి తీసింది. అయితే కింజల్ కు అబ్బాయిలతో సాన్నిహిత్యం ఎక్కువ. చిన్నప్పటి నుంచి తన ఇంటి దగ్గర ఉన్న అబ్బాయిలతో స్నేహంగా ఉండేది. దీంతో బోస్లేకి అనుమానం అనే అతిధి ఆవహించింది. అంతే అభిమానం కాస్తా అశాంతికి దారి తీసింది. ఆ అనుమానం బోస్లే మదిని తొలిచేసింది. కింజల్ అబ్బాయిలతో చనువుగా ఉండటం బోస్లేకు అసలు నచ్చేది కాదు. చాలా సందర్భాల్లో వేరే అబ్బాయిలతో అలా తిరగొద్దని బోస్లే కింజల్ ను హెచ్చరించాడు. కింజల్ మాత్రం అతని మాటలను లెక్కచేయలేదు. అలా తిరిగితే వచ్చిన సమస్య ఏంటంటూ బోస్లేతో వాదించేది.

కింజల్ ఇలా మాట్లాడటం బోస్లేకు అసలు నచ్చలేదు. ఆమెను సోమవారం సాయంత్రం కలవాలని రమ్మన్నాడు. కింజల్ కలవడానికి వచ్చింది. ఆమెను ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన పెరిగింది. ముందుగానే ఆమెను హతమార్చాలని పక్కా ప్లాన్ తో వచ్చిన బోస్లే చేతిలోని కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో ఆమె కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నుంచి బయటకెళ్లిన కూతురు తిరిగిరాకపోవడంతో కింజల్ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మంగళవారం ఉదయం ఆ అపార్ట్ మెంట్ వైపు బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తికి కింజల్ శవం పొదల్లో కనిపించింది. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న కింజల్ ను చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. నింధితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమించిన వాడితో కలకాలం కలిసుండాలని ఆశపడిన ఆ యువతి జీవితం ఇలా ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయింది.

English summary

A boy killed his lover for bad reason