పెళ్ళికి ఒప్పుకోలేదని ఆమెను చంపేశాడు.. ఆ పై తనేం చేసాడో తెలిస్తే షాకౌతారు!

A boy killed his lover for not agreeing marriage

11:55 AM ON 16th September, 2016 By Mirchi Vilas

A boy killed his lover for not agreeing marriage

ఫలానా అమ్మాయి తనకు దక్కకపోతే, ఎవరికీ దక్కకూడదనే విధానం మృగాళ్లలో పెచ్చుమీరిపోతోంది. ఇక చంపేయడం, ఆతర్వాత చచ్చిపోవడం లక్ష్యంగా మారిపోతోంది. ప్రేమ పేరిట దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక పెళ్ళికి నిరాకరించిన ఓ యువతిని హత్య చేసిన ప్రియుడు ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం జరిగింది. 23 ఏళ్ళ ధన్య కుటుంబానికి తెలిసిన వ్యక్తి అయిన 27 ఏళ్ళ జహీర్ తో ఏడాదిగా పరిచయం ఉంది. ఆమెను పెళ్ళి చేసుకుంటానని ధన్య తల్లిదండ్రులను కోరగా వారు నిరాకరించారు. ఇటీవల ఆమెకు ఓ పెళ్ళి సంబంధం కూడా కుదిరింది.

బుధవారం రాత్రి ధన్య కుటుంబసభ్యులు ఆమెను ఇంట్లో ఒంటరిగా ఉంచి ముందు డోర్ కు తాళం వేసి షాపింగ్ కు వెళ్ళారు. ఇంతలో వెనక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించిన జహీర్ తనను పెళ్ళి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. ధన్య నిరాకరించడంతో వెంట తెచ్చిన కొడవలితో హత్య చేశాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంటికి తిరిగి వచ్చిన ధన్య కుటుంబసభ్యులు ఈ దారుణం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో అపస్మారక స్థితిలో ఉన్న జహీర్ ను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ధన్య పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జహీర్ పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సెక్స్ పార్టీలకు అడ్డాగా మారిన కాలేజీ ఇదే!

ఇది కూడా చదవండి: భార్యపై అనుమానంతో తాగొచ్చి ముక్కు కొరికేసాడు.. ఆపై..

ఇది కూడా చదవండి: ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉండాలంటే నెలకోసారి ఈ అన్నం తింటే చాలు!

English summary

A boy killed his lover for not agreeing marriage. A boy killed his lover for not agreeing marriage in Coimbatore. After that he also attempted for suicide.