ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె హిజ్రా అని తెలిసింది.. తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

A boy married a hijra in karnataka

11:13 AM ON 25th June, 2016 By Mirchi Vilas

A boy married a hijra in karnataka

పెళ్లి అనేది నూరేళ్ళ పంట. మరి ఓ యువకుడి పెళ్లి చేసుకుంటే, అక్కడి పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టడం ఏమిటి? ఎవరినైనా బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడా? పెద్దలకు ఇష్టం లేని ప్రేమ పెళ్లా? కాదే. మరి పోలీసులకు నొప్పేంటి? ఇదో పరిష్కరించలేని ఓ వింత పెళ్లి. అందుకే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయింది. అసలు ఈ ఘటనకు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకాలోని కొప్పళ రైల్వే స్టేషన్ లో టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రాధికను గదగేరికి చెందిన శివకుమార్ ప్రేమించాడు.

తమ ప్రేమ గురించి పెద్దలకు తెలియజేసి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఈ ప్రేమ జంట. అయితే అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అయ్యింది. రాధిక మహిళ కాదని హిజ్రా అని తెలుసుకున్న శివకుమార్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. కానీ రాధికను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని.. తాను ఆమెను మూడు రోజుల క్రితమే పెళ్లి కూడా చేసుకున్నానని శివకుమార్ చెప్పాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బేడకొప్పళ నగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ వంశాభివృద్ధి కొనసాగకుండా చేశాడని కొడుకు పై ఫిర్యాదు చేశారు. పిల్లలు లేకుండా ఎలా ఉంటావని తమ కొడుకుని వారు నిలదీస్తున్నారు.

అయితే హిజ్రాలను పెళ్లి చేసుకోవచ్చని 2014లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించడంతో పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేయడంతో శివకుమార్ చాలా ఫేమస్ అయిపోయాడు. దీంతో శివకుమార్ కి పలువురు విషెస్ చెప్పేస్తున్నారు.

English summary

A boy married a hijra in karnataka