స్కూటర్ పై కూర్చున్నాడు.. అంతే కొట్టి చంపేశారు(వీడియో)

A boy murdered in market

04:33 PM ON 4th August, 2016 By Mirchi Vilas

A boy murdered in market

రాను రాను కిరాతకాలు పెరుగుపోతున్నాయి అనడం కన్నా పెరిగిపోయాయి అనడం సబబు. ఎందుకంటే మనుషులు జంతువులని కొట్టి చంపేసే రోజులు పోయి మనుషులు మనుషులనే కొట్టి చంపేసే రోజుల్లో మనం ఉన్నాం. నలుగురు కలిసి ఒక్కడిని చంపేస్తుంటే చుట్టూ వంద మంది ఉన్నా ఒక్కడు నోరు మెదపని సమాజం మనది. ఇంకొద్ది రోజులు పోతే మన లోకంలోకి దేవుడు అడుగు పెట్టడానికి కూడా అసహ్యించుకుంటాడు. ఇక తాజాగా చండీగడ్ లో ఇలాంటి దారుణం ఒకటి చోటు చేసుకుంది. చండీగడ్ లోని ఓ మార్కెట్ లో ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో, కర్రలతో తీవ్రంగా కొట్టారు.

అందరు చూస్తూ ఉన్నా కూడా ఒక్కరు కూడా ఆపలేదు. చివరికి ఆ దుండగులు వెళ్లిపోయాకా అ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో అ యువకుడు మృతి చెందాడు. అయితే ఆ దుండగులు ఆ వ్యక్తిని ఎందుకు కొట్టారనే కారణం ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవి ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A boy murdered in market