ఆరేళ్ళ క్రితం కిడ్నాప్ అయ్యాడు..మరి ఇప్పుడు..

A Boy Reached His Home After Six Years

11:16 AM ON 1st July, 2016 By Mirchi Vilas

A Boy Reached His Home After Six Years

మొత్తానికి కిడ్నాప్ కధ సుఖాంతం అయింది. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఢిల్లీ లో కిడ్నాప్ కు గురైన కుర్రాడు సోను తిరిగి క్షేమంగా తన పేరెంట్స్ దగ్గరకు చేరుకున్నాడు. ఇప్పుడు వాడి వయస్సు 12 ఏళ్ళు. ఇన్నేళ్ళకు తన తలిదండ్రులు ముంతాజ్, మెహబూబ్ లను కలిసి వారిని ఆనందంలో ముంచెత్తాడు. 2010 లో సోను ఇంటిపక్కనే నివసించే ఓ మహిళ ఇతన్ని కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్ కు తీసుకుపోయింది. అక్కడి జెస్సోర్ అనే ప్రాంతంలో ఓ కుటుంబానికి ఈ బాలుడ్ని అమ్మేసింది.

ఆ ఫ్యామిలీ సోను ను టార్చర్ పెడుతూ ఇంటి పనులన్నీ చేయించుకునేవారట. చివరకు మూసా అనే వ్యక్తికి ఈ విషయం తెలిసి సోను ను చిల్డ్రన్స్ హోం కు తరలించేలా చూశాడు. పైగా ఇటీవల సోను చెప్పిన అడ్రస్ తో ఇండియాకు వచ్చి అతని తలిదండ్రులను కలిశాడు. చివరకు సోను కథ సుఖాంతం కావడంతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆ కుర్రాడు తల్లి దండ్రులు కూడా సుష్మా కు కృతజ్ఞతలు చెప్పారు.

ఇవి కూడా చదవండి:భాగ్యలక్ష్మి టెంపుల్ పై ఐసిస్ కళ్ళు

ఇవి కూడా చదవండి:బిజెపి నేత ఇంట 'బాల్య వివాహం’..షాకింగ్ న్యూస్

English summary

A Boy Named Sonu was kidnapped by one of the neighbour and she was taken him to Bangladesh and she sold to one family and now he came back to India after Six years and reached his parents and the parents said thanks to Sushma Swaraj.