శ్రీవారి హుండీకే ఎసరు పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు!

A boy stolen money from Srivari Hundi

03:45 PM ON 28th July, 2016 By Mirchi Vilas

A boy stolen money from Srivari Hundi

సాక్షాత్తూ తిరుమల శ్రీవారి హుండీలోనే చేయిపెట్టి డబ్బు కాజేసాడు ఓ ప్రబుద్ధుడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. కట్టుదిట్టమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో చోరీకి పాల్పడిన ఆ నింధితుడిని పోలీసులు అరెస్టుచేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వి.అర్జున.. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం రాత్రి ఆలయంలోకి చేరుకున్నాడు. ఎవరూ లేని సమయంలో బంగారువాకిలి సమీపంలోని ప్రధాన హుండీలో నగదును చోరీచేశాడు. దీనిని సీసీ కెమెరాల్లో సిబ్బంది గమనించి.. వెంటనే ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా అధికారులకు ఉప్పందించారు.

అనంతరం తనిఖీల్లో అర్జునను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించి రూ.50,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చర్యల నిమిత్తం తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. ఇతడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా, గతంలోనూ హుండీ చోరీకేసులో ఇతడు నింధితుడట. ఈ విషయం పోలీసులు ధ్రువీకరించారు.

English summary

A boy stolen money from Srivari Hundi