ప్రియురాలి కోసం బాహుబలిలో ప్రభాస్ లాగ సాహసం చేసిన ప్రేమికుడు

A boy takes life risk for his lover hat

11:02 AM ON 26th May, 2016 By Mirchi Vilas

A boy takes life risk for his lover hat

'బాహుబలి' చిత్రంలో తమన్నా కోసం ప్రభాస్ ఏకంగా కొండలు ఎక్కుతాడు.. ఎంతో సాహసం చేసి గమ్యం చేరుతాడు.. ఆ సాహసంతో తమన్నా మనసును దోచుకుంటాడు.. అచ్చం సినిమాలానే ప్రియురాలి కోసం ఓ చైనా కుర్రాడు ఇలాంటి సాహసమే చేసాడు. ప్రియురాలు ధరించిన హ్యట్(టోపీ) కోసం తన లైఫ్ నే రిస్క్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం విన్న వారికి ఒళ్ళు జలదరిస్తుంది.. ప్రేమికుల రోజుకు ముందురోజు జరిగిన ఈ ఘటన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని జింజి పర్వతాల అందాలను వీక్షించడానికి ఓ ప్రేమ జంట అక్కడికి వచ్చింది.

అక్కడ ఒక్కసారిగా బలమైన గాలుల వీచడంతో ప్రియురాలి హ్యాట్ ఎగిరిపోయి కొండ అంచులో పడిపోయింది. దీంతో ఆమె అప్ సెట్ కాకూడదు అనుకున్నాడో లేక క్యాప్ ఖరీదైందో గాని ప్రాణాలకు తెగించి మరీ క్యాప్ ను తీసుకొచ్చాడు ఆ ప్రియుడు. పట్టు తప్పితే అతడు 1640 అడుగుల లోతైన లోయలో పడిపోయే అవకాశం ఉన్నా చాకచక్యంగా క్యాప్ తీసుకొని కొండెక్కాడు. పేరు తెలియని ఈ ప్రేమికుడు చేసిన సాహసం అక్కడివారిని మునివేళ్ల మీద నిలబడేలా చేసింది. కొండ పైకి వస్తున్న అతన్ని అక్కడి వారు చప్పట్లతో అభినందించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆ పర్యాటక ప్రదేశంలోని అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని, చర్యలు తీసుకుంటామంటున్నారు.

అంత కష్టపడి క్యాప్ తీసుకొచ్చిన ఆ కుర్రాడి శ్రమ ఊరికే పోకుండా ప్రియురాలు హగ్ తో స్వాగతించింది.

English summary

A boy takes life risk for his lover hat