దారుణం మంచి నీళ్ళు తాగాడని రైలుకి కట్టి కొట్టారు!

A boy tied to train window and thrashed over drinking water

03:04 PM ON 29th March, 2016 By Mirchi Vilas

A boy tied to train window and thrashed over drinking water

ఇదేమి దారణం... ఇదేమి చోద్యం... దాహం వేసి మంచి నీళ్ళు తాగాడని ఓ యువకుడిని రైలుకి కట్టేసి కొట్టారా? తోటి ప్రయాణికుడి దగ్గర గల బాటిల్ ని తీసుకుని మంచి నీళ్ళు తాగితే, దానికి ఇంత క్రూరమైన శిక్షా... అలా రైలుకి వేలాడ దీసి, కొట్టడం సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి, ఓ సారి వివరాల్లోకి వెళితే, మధ్య ప్రదేశ్ లోని ఇటార్సీ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడిని రైలుకు వేలాడ దీసారు. ఎందుకా అని ఆరా తీస్తే, తమ బాటిల్ లోని వాటర్ ని తాగాడన్న కారణంగా ముగ్గురు యువకులు కలిసి ఈ పని చేసారు. ఆ యువకుడి ఫాంటు ఊడదీసి, ఆ ఫాంటు తోనే అతని రెండు కాళ్ళను రైలు కిటికీకి కట్టేశారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ మిస్‌ చేసుకున్న సూపర్‌ హిట్‌ మూవీస్‌

అలా రైలుకి కట్టేసి, చితక్కొట్టారు. కొంతసేపటికి పట్టు సడలి తలకిందులుగా వేలాడాడు. ఇది చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారట. అయితే ఇంత దారుణం జరిగినా ఎవరూ నోరు మెదపలేదట. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలో దిగి, ఈ క్రూరత్వానికి ఒడిగట్టిన ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారట. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: నగ్నంగా నటించడానికి నేను రెడీ..


English summary

A boy tied to train window and thrashed over drinking water. A boy tied to train window and tharshed over drinking water at Madhya Pradesh.