పెళ్లికయ్యే ఖర్చుతో... పేదలకు ఇళ్లు కట్టించింది

A Bride Gave 108 Houses to Poor People As Her Wedding Gifts

10:40 AM ON 14th December, 2016 By Mirchi Vilas

A Bride Gave 108 Houses to Poor People As Her Wedding Gifts

సాధారణంగా పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం చూస్తుంటాం. స్థోమతకు మించి కూడా ఖర్చు చేస్తుంటారు. అయితే ఓ నూతన వధువు డిఫరెంట్ గా చేసింది. తన పెళ్లిని సాదారణంగా చేసుకొని, పెళ్లికయ్యే ఖర్చుతో,108 మంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించ్చింది. నిజమైన ఆదర్శానికి దర్పణంగా నిల్చింది. ఎందరో కళ్ళల్లో ఆనందం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రకు చెందిన శ్రేయ మునోద్ ది బాగా డబ్బున్న కుటుంబం. ఆమె అత్తింటి వాళ్లు కూడా శ్రీమంతులే.. దీంతో తన పెళ్లిని తరతరాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆలోచించిన శ్రేయ. తన పెళ్లికి ఖర్చు చేయాల్సిన డబ్బుతో 108 ఇళ్లను ప్రారంభించిది. అందులో ఆమె పెళ్లినాటికి 90 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించబడ్డాయి.

ముందుగా శ్రేయ గుర్తించిన నిరుపేదలను, తన పెళ్లికి ప్రత్యేక అతిథులుగా పిలిచి, కొత్త ఇంటి తాళాలను వారి చేతికందించింది. మిగిలిన 18 ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి, వాటిని కూడా నిరుపేదలకు ఇచ్చే ఆలోచనలో ఉంది ఈ నూతన వధువు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని చూస్తున్న ఈ రోజుల్లో, ఈ నూతన వధువు ఆలోచన నిజంగా అభినందనీయం ఈమె నిర్ణయాన్ని భర్తతో సహా…అత్తింటి వారు కూడా స్వాగతించారు. ఇళ్ళను కానుగా పొందిన వారు….నూతన వధూవరులను తమ కొత్త ఇండ్లలోకి ఆహ్వానించి సన్మానించారు.

గాలి జనార్థన్ రెడ్డి కూతురి పెళ్లి కంటే శ్రేయ మునోద్ వివాహం నాకంటికి వేయి రెట్లు గొప్పది. ఆట, పాట ,అట్టాహాసాలకు కోట్లు ఖర్చు పెట్టిన గాలి జనార్థన్ రెడ్డి ఈ మేరకు ఆలోచించి ఉంటే….కనీసం ఓ 5000 ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్ : ముట్టుకోకుండానే 16 మందిని గర్భవతులను చేశాడు..!

ఇవి కూడా చదవండి: వావ్ ఇదేం రూలండి - నడుం నాజూకుగా లేకుంటే టాక్స్ తప్పదట

English summary

A New Bride Named Shreya who belongs to Aurangabad was married a bridegroom and the two families were rich and the bride decided to do their marriage simple and she built 108 houses to the poor people as gifts of her marriage.