పెళ్లి అయినా ఓటు వేసే పెళ్లిపీటలెక్కింది(వీడియో)

A bride votes first and later went to marriage

05:37 PM ON 16th May, 2016 By Mirchi Vilas

A bride votes first and later went to marriage

అవునా అంటే అవునని నిరూపించింది ఓ పెళ్ళికూతురు. తన పెళ్లి రోజు తనకెంత ముఖ్యమో ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆ పెళ్ళికూతురు చెబుతోంది. అందుకే ఆచరించి చూపింది. కేరళలో అనూ అనే పాతికేళ్ళ యువతికి సోమవారం ఉదయం ఆమె వివాహం.. గోల్డ్ కలర్ శారీ.. జువెల్లరీతో మెరిసిపోయిన ఈ అమ్మడు మరో రెండు గంటల్లో తన పెళ్లి జరుగుతుందనగా.. బ్యూటీ పార్లర్ నుంచి మేకప్ అయి, అట్నుంచి అటే.. పోలింగ్ కేంద్రానికి పరుగులు తీసింది. ఓటు హక్కు వినియోగించుకుంది. అనూకి ఓటు వేయడం ఇదే మొదటిసారట.. నా వెడ్డింగ్ డే లాగే మొదటిసారిగా ఇదీ నాకు ముఖ్యమే.. అంటూ చకచకా మాట్లాడి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది.

పదమ్మా.. పెళ్ళికి టైం దగ్గర పడుతోంది.. కావాలంటే ఆ మూడు ముళ్ళూ పడ్డాక వెళ్లి ఓటు వేద్దువులే అని తన పేరెంట్స్, బంధువులు తొందర చేస్తున్నా అనూ వినకుండా తన పంతం తీర్చుకుని మ్యారేజ్ హాలు చేరుకుంది. సరిగ్గా ముహూర్తం వేళకి వెళ్లి తాళి కట్టించుకుంది. రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికల్లో పాల్గొని మరీ తన భవిష్యత్తు చూసుకున్న ఆ యువతికి హేట్సాఫ్....

English summary

A bride votes first and later went to marriage