పెళ్లి మరో కొద్ది గంటల్లో.. చేతిలో డబ్బుల్లేవ్.. బ్యాంకుకెళ్ళింది.. ఆపై ఏమైందో తెలుసా?

A bride went to bank for money

12:11 PM ON 25th November, 2016 By Mirchi Vilas

A bride went to bank for money

పెద్దనోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఇంచుమించు అందరూ ఆమోదిస్తున్నా, అమలులో విఫలమైందని పలు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూలో నిల్చుని పడుతున్న ప్రజల కష్టాలు కూడా తక్కువేమీ కాదు. కొన్ని చోట్ల పెళ్లిళ్లు పోస్ట్ ఫోన్ అవుతున్నాయట. ఎందుకంటే, పెళ్లి సంబంధాలు కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు, పెళ్లి కుదుర్చుకుని, మరికొద్ది రోజుల్లో ఏకమవబోతున్న జంటలకు ఈ నోట్ల రద్దు ఎఫెక్ట్ బాగానే తగిలింది. అందుకే పాత నోట్ల రద్దుతో పెళ్లిళ్లు వాయిదా పడిన ఘటనలు, ఆగిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.

అయితే, మొత్తానికి కేంద్రం ఆ తర్వాత పెళ్లిళ్లకు సంబంధించి కొన్ని సడలింపులు చేసింది. తగిన సాక్ష్యాలు చూపిస్తే 2.5లక్షల రూపాయల వరకూ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించడంతో పెళ్లి జంటలు కొంతవరకూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, మధ్యప్రదేశ్ లోని బర్వానీ జిల్లాలో పెళ్లి చేసుకోబోతున్న యువతి పెళ్లి దుస్తులతో బ్యాంకుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా, మరికొద్దిసేపట్లో ఆమె పెళ్లిపీటలపై కూర్చోవాల్సి ఉండగా బ్యాంకుకు వెళ్లడంతో బ్యాంకు దగ్గర బారులు తీరిన ప్రజలు నిర్ఘాంతపోయారు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. 

1/3 Pages

ఆర్తి ప్రజాపతి అనే 23 ఏళ్ల యువతికి గత సోమవారం పెళ్లి జరిగింది. ఆమె పెళ్లి కోసం తల్లి 1.74 లక్షల డబ్బును కూడబెట్టింది. ఆ డబ్బంతా 5వందలు, వెయ్యి రూపాయల నోట్లే. ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకుని, పెళ్లి ఖర్చుల నిమిత్తం తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చని ఆ కుటుంబం భావించింది.

English summary

A bride went to bank for money