అక్కపై ప్రేమతో... ఆ నోట్లు అలానే ఉంచేసాడు!

A brother keeps 500 notes for his sister

11:31 AM ON 11th November, 2016 By Mirchi Vilas

A brother keeps 500 notes for his sister

ఇది హైదరాబాద్ నార్సింగ్ లోని సాయికుమార్ నోట్ల కథ తెలిస్తే విస్తుపోతాం. ప్రతి ఏడాది జనవరి ఫస్ట్ కు వాళ్ల అక్క ఐదు వందల రూపాయలపై న్యూ ఈయర్ విషెస్ చెబుతూ బహుమతిగా ఇస్తోంది. గత పదేళ్లుగా అక్క ఇచ్చిన రూ.500 నోట్లను అలాగే దాచుకున్నాడు. కానీ పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు తమ్ముడు తల్లడిల్లుతున్నాడు. నోట్లపై అక్కరాసిన అక్షరాలున్నాయి వాటిని బ్యాంకులో వేయడం ఇష్టం లేదని తన వద్దనే, అక్క ఇచ్చిన గిఫ్ట్ గా ఉంచుకుంటానని అంటున్నాడు.

1/2 Pages

పాత నోట్లతో పన్నులు కట్టేయొచ్చు...


అవును, పాత 500, వెయ్యినోట్లున్న వారికి కేంద్ర ప్రభుత్వం పండుగలాంటి వార్తను అందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఈ నోట్లను ప్రభుత్వ బకాయిలు తీర్చేందుకు వాడుకోవచ్చని ప్రకటించింది. కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, పన్నులు, జరిమానాలు కట్టేందుకు ఈ నోట్లను వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆస్తి పన్నుతో సహా ఇతర పన్నులంటినీ పాత నోట్లతో కట్టుకోవచ్చు. అయితే నవంబర్ 11 అర్ధరాత్రి వరకు మాత్రమే చెల్లించేందుకు అనుమతించారు. ఇక మిగతా రాష్ట్రాల అభ్యర్ధననూ కేంద్రం పరిశీలిస్తోంది.

English summary

A brother keeps 500 notes for his sister