కూతురిని విసిరేసి చంపిన కిరాతక తండ్రికి 15వందల కొరడా దెబ్బలు.. ఆపైన..

A brutal father thrown his baby and killed in Saudi

06:15 PM ON 13th June, 2016 By Mirchi Vilas

A brutal father thrown his baby and killed in Saudi

మనదేశంలో ఏమోగానీ సౌదీలో నేరానికి శిక్ష మామూలుగా వుండదు. కోర్టులు ఆ విధంగా తీర్పునిస్తాయి. ఇక సౌదీలో తప్పు చేస్తే అత్యంత కఠినంగా శిక్షిస్తారన్న సంగతి చెప్పక్కర్లేదు. నేరస్థుల విషయంలో ప్రభుత్వం, న్యాయస్థానాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం అక్కడ అత్యంత సహజం. తాజాగా ఓ నింధితుడి కేసులో సౌదీ కోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. సౌదీకి చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్ కు, మద్యానికి బానిస అయ్యాడు. ఒకరోజు మద్యం మత్తులో తన కన్నకూతురినే కొట్టాడు. దారుణంగా హింసించాడు. కిటికీలో నుంచి కిందకు విసిరేశాడు.

దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్యను సౌదీ ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణించింది. నింధితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 15 వందల కొరడా దెబ్బలు, 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాగా పోలీసు విచారణలో నింధితుడు కొత్త వాదన వినిపించాడు. తన కూతురికి దెయ్యం పట్టిందని... అందుకనే తాను కొట్టానని చెప్పుకొచ్చాడు. అయినా కోర్టు ఈ వాదనను తోసిపుచ్చి, కఠిన శిక్ష విధించింది.

English summary

A brutal father thrown his baby and killed in Saudi