అందరూ చూస్తుండగానే ఆఫీసు నుండి ఈడ్చుకెళ్ళీ మరీ రేప్ చేసాడు

A brutal man dragged out a woman from her office and raped in punjab

11:26 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

A brutal man dragged out a woman from her office and raped in punjab

రోజు రోజుకి లోకంలో ఘోరాలు పెరిగిపోతున్నాయి, అసలు ఎవరేం చేస్తారులే అనే ధైర్యంతో మరీ నేరాలు చేస్తున్నారు. ఆ నేరాలు చేస్తుంటే చూస్తున్న ప్రజలు కూడా మనకెందుకులే అని పట్టించుకోవడం లేదు. ఇంక ఇలానే ఉంటే నేరాలు మరింత ఎక్కువవ్వడం ఖాయం. తాజాగా పంజాబ్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఓ కంప్యూటర్ సెంటర్లో పని చేస్తున్న ఓ దళిత యువతిని.. ఆమె గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఈడ్చుకుంటూ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అయితే, ఆమెను లాక్కెళ్తున్న సన్నివేశాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అసలు కధలోకి వెళ్తే... పంజాబ్‌లోని ముక్త్సర్ నగరంలో ఓ కంప్యూటర్ సెంటర్‌లో పనిచేస్తోంది ఈ యువతి. ఆమె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమె పని చేస్తున్న ఆఫీస్‌కు వెళ్లి ఆమెను బయటికి ఈడ్చుకొచ్చాడు. 100 మీటర్ల దూరంలో నిలిపిన కారు దగ్గరికి ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కారులో పడేశాడు. నిత్యం జనం సంచరించే మెయిన్‌రోడ్డు పై తన పశుబలాన్ని ప్రదర్శిస్తుంటే అందరూ చూస్తూ నిల్చున్నారే తప్ప ఏ ఒక్కరూ ఇదేంటి అని అడ్డుకోలేదు.

ఆ తర్వాత ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి రాత్రంతా బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మార్చి 24న జరిగిన ఈ ఘటన పై మరుసటి రోజు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆఫీసులో బాధితురాలి కొలిగ్స్ కూడా వాంగ్మూలం ఇస్తామన్నారు. అయినా సరే పోలీసులు ఇంకా ఆ కీచకున్ని అదుపులోకి తీసుకోలేదు. దీంతో యువతి జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. సాక్ష్యాధారాలున్నా, ఇంత దారుణం జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలంటూ పోలీసులకు జాతీయ ఎస్సీ కమీషన్ నోటీసులు జారీ చేసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు నెల రోజులు తరువాత ఆ కీచకుడ్ని అరెస్ట్ చేసింది.

English summary

A brutal man dragged out a woman from her office and raped in punjab. A dalit woman dragged out and raped in a Punjab.