అమ్మాయికి మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్లిపోయాడు.. ఆ తరువాత చేతులు కట్టేసి..

A brutal man killed a minor girl in Hyderabad

11:32 AM ON 20th September, 2016 By Mirchi Vilas

A brutal man killed a minor girl in Hyderabad

గండిపేట శివారులో ఆదివారం మైనర్ బాలిక ఓ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది. మృతురాలిని పాతబస్తీ ఇంజన్ బౌలీకి చెందిన అమీనాగా గుర్తించారు. నూరీనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో అమీనా 9వ తరగతి చదువుతోంది. మాయమాటలు చెప్పి అమీనాను బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్యమైన గండిపేట ప్రాంతానికి తీసుకెళ్లిన అక్బర్.. అక్కడ అమీనా చేతులు కట్టేసి, గొంతు కోసి, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారింది. అయితే, తమ కుమార్తె కనిపించడం లేదని అమీనా తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గండిపేట పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో అక్బర్, అమీనాలు బైక్ పై వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా నార్సింగి పోలీసులు కొన్ని గంటల్లోనే ఈ కేసు మిస్టరీని చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నింధితుడిని పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీకి చెందిన నింధితుడు అక్బర్(చోర్ అక్బర్) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసమే అమీనాను హత్య చేసినట్లు అక్బర్ పోలీసులకు చెప్పాడు.

English summary

A brutal man killed a minor girl in Hyderabad