నేపాల్ జల్లికట్టులో దారుణం

A Bull Severely Injured A Man In Nepal

11:40 AM ON 17th January, 2017 By Mirchi Vilas

A Bull Severely Injured A Man In Nepal

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, ఇక మన చిత్తూరు జిల్లా, అటు తమిళనాడు మాత్రమే జల్లికట్టుకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెల్సిందే. ఈ పందాలపై కోర్టుల వరకూ వెళ్ళనా చివరకూ చాలాచోట్ల ఈ పందాలు సాగాయి. ఇక బుల్ ఫైట్ పేరుతో బైటి దేశాల్లో కూడా ఈ జల్లికట్టును విపరీతంగా ఆడేస్తారు. కాకపోతే పద్ధతులే తేడా ఉంటాయి. నేపాల్ దేశంలో బుల్ ఫైట్‌కున్న క్రేజే వేరు. మాఘ మాసం ప్రారంభాన్ని, చలికాలం ముగిసిపోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 'మాఘే సంక్రాంతి' పేరుతో హిమాలయ పర్వతాల దిగువలో.. ఈ సాహస క్రీడను వేడుకగా జరుపుకుంటారు.

రాజధాని ఖాట్మండుకు 80 కిలోమీటర్ల దూరంలోని తారక అనే ప్రాంతంలో జరిగే ఈ జంతు క్రీడను చూడ్డానికి వేలాది మంది చేరుకుంటారు. రెండు పోటెద్దులు ఢీకొడితే.. ఆ యుద్ధ సన్నివేశం చూడ్డానికి వీరంతా ఎగబడతారు. ఈసారి.. 'గేమ్'లో ఒక అపశృతి దొర్లింది. పొరబాటున ఎద్దుకు దొరికిపోయిన ఒక ప్రేక్షకుడు.. ఇప్పుడు చావుబతుకుల్లో వున్నాడు. ఇతణ్ణి కుమ్ముకుమ్మి వదిలేసిన ఎద్దును అదుపులోకి తీసుకోడానికి సెక్యూరిటీ వాళ్ళు చాలా శ్రమ పడాల్సివచ్చింది.

ఇవి కూడా చదవండి: పాకిస్థాన్ బాహుబలి -- ఇంతకీ ఇతని బరువు తెలిస్తే షాకవుతారు

ఇవి కూడా చదవండి: సౌందర్యం అరువు తెచ్చుకుంటే ఇక అంతే సంగతులు ?

English summary

Jallikattu was famous in AP and Tamilnadu and people of Nepal will also celebrate Jakllikattu Like game and recently a bull severely injured a man and he was in critical position in hospital.