డబ్బులిచ్చి మరీ తనను తానే హత్య చేయించుకున్నాడు.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

A businessman murdered himself for insurance

01:32 PM ON 20th September, 2016 By Mirchi Vilas

A businessman murdered himself for insurance

రకరకాల మనుషులు ఈ ప్రపంచంలో వుంటారు. ఇక ఇన్స్యూరెన్స్ వస్తుందని తద్వారా కుటుంబానికి మేలు చేకూరుతుందని ఓ వ్యాపారి తనను తాను హత్య చేయించుకున్న వైనం ఇది. తన కుటుంబానికి జీవితభీమా సొమ్ము వస్తుందని భావించిన 55 ఏళ్ల ఓ వ్యాపారి స్వయంగా తన దుకాణంలో పనిచేస్తున్న ఓ యువకుడికి డబ్బులిచ్చి హత్య చేయించుకున్న ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ లో సంచలనం సృష్టించింది. సినిమాటిక్ గా జరిగిన ఈ ఘటన హర్యానాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

సోనిపట్ ప్రాంతంలోని గోరద్ గ్రామానికి చెందిన సత్బీర్ సింగ్ వడ్డీ కింద రెట్టింపు డబ్బు ఇస్తానని చెప్పి రుణాలు తీసుకొని కిరణాదుకాణం నిర్వహించాడు. జనం నుంచి తీసుకున్న రుణాలు తీర్చలేక సత్బీర్ సింగ్ రూ.60 లక్షల మేర బాకీ పడి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. సత్బీర్ కు భార్య నలుగురు పిల్లలున్నారు. అప్పులతోపాటు సత్బీర్ కు పలు రకాల ఆరోగ్య సమస్యలున్నాయి. తాను ఆత్మహత్య చేసుకుంటే జీవిత బీమా డబ్బులు రావని, తాను హత్యకు గురైతే కుటుంబానికి సాయంగా బీమా డబ్బు ఉంటుందని సత్బీర్ భావించాడు.

English summary

A businessman murdered himself for insurance. A haryana businessman murdered himself for getting 60 lakhs insurance.