వాటర్ స్లైడ్ వద్ద బాలుడి ప్రాణాలు పోయాయ్(వీడియో)

A child died at world's tallest water slide in America

11:21 AM ON 9th August, 2016 By Mirchi Vilas

A child died at world's tallest water slide in America

ప్రపంచంలో అతిపెద్ద వాటర్ స్లైడ్ వద్ద పెద్ద విషాదం చోటుచేసుకుంది. లోకల్ ప్రజాప్రతినిధికి చెందిన 12 ఏళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని కాన్సాస్ సిటీలోని 168 అడుగుల ఎత్తైన వెర్రుక్ట్ వాటర్ స్లైడ్ వద్ద ఆదివారం 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు పార్క్ ప్రతినిధి వింటర్ ప్రోసాపియో వెల్లడించారు. అయితే బాలుడు ఎలా మరణించాడన్నది మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్ అధికారులు బాలుడి వివరాలు తెలపలేదు. అయితే అక్కడి లెజిస్లేటర్, కాన్సాస్ స్టేట్ రిప్రజెంటేటివ్ స్కాట్ షెవాబ్ దంపతులు ఈ దుర్ఘటనలో మరణించిన బాలుడు తమ కొడుకు కాలెబ్ థామస్ షెవాబ్ అని ప్రకటించారు.

ఈ ఘటనతో వాటర్ పార్కును ఆది, సోమవారాల్లో మూసి ఉంచారు. ఘటన ఎలా జరిగింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి ఈ ఘటన అందరిని కలచివేసింది.

English summary

A child died at world's tallest water slide in America