300ఏళ్ళ క్రితం చనిపోయింది.. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచింది(వీడియో)

A child died before 300 years and now opened her eyes

11:30 AM ON 27th September, 2016 By Mirchi Vilas

A child died before 300 years and now opened her eyes

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలూ, విడ్డూరాలు సహజం. కొన్ని మిరాకిల్ గా ఉంటాయి. మరికొన్ని అసహజంగా ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏమంటే, ఒకామె 300 ఏళ్ల క్రితం చనిపోయింది. కానీ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూసింది. అందరూ షాక్ అయ్యారు. భయంతో వణికిపోయారు. కానీ ఓ పర్యాటకుడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

300 సంవత్సరాల క్రితం శాంతా ఇనోసెన్సియా అనే చిన్నారి ఉండేది. నిత్యం ఏసు క్రీస్తు ధ్యానంలో ఉండే ఆమె ఓ రోజు నన్ గా మారిపోవాలని నిర్ణయించుకుందట. కానీ ఆమె నన్ గా మారిపోవడం ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని తెలియడంతో, ఆమె ఇల్లు వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో తండ్రి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో క్రీస్తు భక్తికి చిహ్నంగా ఇనోసెన్సియా భౌతికకాయాన్ని చర్చిలోనే ఉంచాలని మత పెద్దలు నిర్ణయించారు. శరీరం కుళ్లిపోకుండా వివిధ రసాయనాలతో గాజు పెట్టెలో ఉంచారు. అయితే తాజాగా ఆ మృతదేహం కళ్లు తెరిచి చూసింది. వీడియోలో ఆమె కళ్లు తెరస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇనోసెన్సియా కళ్లు తెరిచి చూసేందుకు గల స్పష్టమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కామెంట్లు మిశ్రమ స్పందనను తెలియజేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: మనిషి చితాభస్మం నుంచి వజ్రాలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఎక్కడ?

ఇది కూడా చదవండి: పాడైన ఆహారం అందించిన ఎయిరిండియాకు లక్ష జరిమానా

ఇది కూడా చదవండి: రోజూ పరగడుపున గోరు వెచ్చని నీటితో నిమ్మరసం తాగితే..

English summary

A child died before 300 years and now opened her eyes. A child girl died before 300 years ago. After 300 years she opened her eyes in front of tourists.