ఈ చిన్నపాప చేసిన దొంగతనం చూస్తే దొంగలు కూడా ఆశ్చర్యపోతారు(వీడియో)

A child turned as a thief

12:03 PM ON 26th May, 2016 By Mirchi Vilas

A child turned as a thief

ఆడుకోవాల్సిన వయసులో ఒక అమ్మాయి దొంగ వృత్తిని ఎంచుకుంది.. ఆమె చేసిన దొంగతనం చేస్తే దొంగలు, పోలీసులు సైతం ఆశ్చర్యపోక మానరు. అసలు విషయంలోకి వెళ్తే.. నవీముంబైలోని ఓ రెస్టారెంట్కు గత వారం ఇద్దరు చిన్న పిల్లలతోపాటు ముగ్గురు మహిళలు వచ్చారు. ఆ ముగ్గురు మహిళలు క్యాష్ పాయింట్ వద్ద ఉన్న రెస్టారెంట్ యజమానిని, మిగతా వారిని మాటాల్లో పెట్టారు. ఇంతలో వారితో వచ్చిన ఓ చిన్న పాప కౌంటర్ వద్దకు వెళ్లింది. కిందకు వంగి టేబుల్ సొరుగు తెరిచేందుకు ప్రయత్నించింది, అయితే అది తెరుచుకోలేదు. అయినా ఏ మాత్రం కంగారు పడకుండా పక్క సొరగును తెరిచి అందులో నుంచి తాళాలు తీసి డబ్బులున్న సొరుగును ఓపెన్ చేసింది.

అందులో ఉన్న డబ్బు కట్టలను సంచిలో వేసుకుంది. మళ్లీ తాళం వేసి పక్క సొరగులో పెట్టేసింది. ఆ తరువాత అందరూ అక్కణ్నుంచి మెల్లిగా జారుకున్నారు. ఈ దొంగతనం జరుగుతున్నంత సేపూ ఆ ముగ్గురు మహిళలు రెస్టారెంట్ యజమానితో మాట్లాడుతూ తమ చున్నీలతో ఆ చిన్నారి కనబడకుండా కవర్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన అనంతరం సొరుగు ఓపెన్ చేసిన యజమాని అక్కడ డబ్బులేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఆ వీడియో చూసి ఆ చిన్న పాప ధైర్యానికి ఆశ్చర్యపోయారు. మొత్తం 20 వేలు పోయినట్టు గుర్తించారు. అనంతరం వారిని ఓ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. మొత్తానికి దొంగలనే మించిపోయింది కదా ఆ అమ్మాయి.

English summary

A child turned as a thief