దేవుడే ఉంటే నన్ను కాపాడతాడని సింహాల దగ్గరకు వెళ్ళాడు.. అవి ఏం చేశాయో చూడండి

A church paster gone near to lions

11:09 AM ON 9th September, 2016 By Mirchi Vilas

A church paster gone near to lions

ఇది మితిమీరిని ఆత్మ విశ్వాసంతో చేసిన పనికి తగిన మూల్యం చెల్లించిన వైనం ఇది. దక్షిణాఫ్రికాలోని జియాన్ క్రిస్టియన్ చర్చి పాస్టర్ అలెక్ ఎండివాన్.. సహ పాస్టర్లతో క్రూగర్ నేషనల్ సఫారీ పార్కు సందర్శనకు వెళ్లాడు. అక్కడున్న సింహాల గుంపును చూసి.. దేవుడే వాటినుంచి తనను రక్షిస్తాడంటూ దేవుడు గొప్పో.. ఆ సింహాలు గొప్పో తేల్చేస్తానని సహచరులతో గొప్పలకుపోయాడు. మరి దేవుడు గొప్పా.. సింహం గొప్పా? అని తర్కం వెతకొచ్చు గానీ.. ప్రయోగానికి దిగితే సింహం వేటాడి కండలు పీకేయడం ఖాయం కదా. సరిగ్గా ఇలాగే జరిగింది ఈ క్రైస్తవ మతగురువుకు. బుద్ధిగా వేటను తింటున్న సింహాలను రెచ్చగొట్టేలా దేవుడా నువ్వే గనక ఉంటే... ఈ సింహాల గుంపు నన్నేం చేయబోవుగాక అంటూ కేకలు పెట్టాడు.

ఆ కేకలతో రెచ్చిపోయిన మృగరాజులు.. ఎండివాన్ వైపు ఉరికొచ్చాయి. ఆ భీకర గుంపును చూసి హతాశుడైన మతగురువు దేవుడా అంటూ పరుగందుకున్నాడు. పాపం.. సింహాల వేగం ముందు అతడి పరుగు సరిపోక దొరికిపోయాడు. సింహాల వాడి పంజా దెబ్బలకు అతడి పిరుదులు ఛిద్రమయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినా సరే.. బహుశా.. జంతువులపై దేవుడు తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే నన్ను వాడుకుని ఉంటాడు అని ఎండివాన్ సరిపెట్టుకుంటున్నాడట.

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ లో కొత్తసీన్స్ యాడ్ అయ్యాయి

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

ఇది కూడా చదవండి: అఖిల్ పెళ్లి ఫిక్స్ .. డిసెంబర్ 9న నిశ్చితార్ధం

English summary

A church paster gone near to lions