భార్యను చంపి సేమ్ 'దృశ్యం' సినిమా కధలా మలిచాడు

A conistable husband killed his wife

11:51 AM ON 10th May, 2016 By Mirchi Vilas

A conistable husband killed his wife

విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా కధ కన్నా ఆ సినిమా స్క్రీన్ ప్లే వల్లే సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమాను బాగా అర్థం చేసుకుని బుర్ర‌కు ఎక్కించుకున్నాడు ఓ కిరాతకుడు. ఆ.. సినిమా హీరో పాత్రను రియల్ లైఫ్‌లోనూ ఫాలో అయ్యాడు. కాకపోతే సినిమాలో హీరో ఫ్యామిలీ మీద ప్రేమతో చేస్తే ఈయన గారు మాత్రం భార్యను వదిలించుకునేందుకు ఆ స్క్రీన్ ప్లేను ఫాలో అయ్యాడు. అతి తెలివికి పోయాడు. అన్న‌ట్లు గురుడు ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, పేరు రామ‌కృష్ణ‌, ఊరు నిజామాబాద్‌, నారాయ‌ణ‌గూడ పీఎస్‌లో ఉంటాడు.

ఇది కూడా చదవండి: భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

పోలీస్‌గా ట్రాక్ రికార్డ్ బాగుడండం, మంచి కుటుంబం కావ‌డంతో 2015 ఆగస్టు 20న మ‌నోడిని సుప్రియకు ఇచ్చి అంగ‌రంగ వైభవంగా వివాహం జ‌రిపించారు పెద్ద‌లు. త‌రువాత హిమాయ‌త్ న‌గ‌ర్‌లో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల త‌రువాత త‌న భార్య‌ను అనుమానించ‌డం మొద‌లుపెట్టాడు. క్ర‌మంగా అది ముదిరిపాకాన ప‌డ‌డంతో ఒంటరిగా ఉన్న సుప్రియ‌ను ట‌వ‌ల్ తో ఉరేసి చంపేశాడు. స్నేహితుడు ప్ర‌దీప్ సాయంతో మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి, వికారాబాద్ అడ‌వులకు త‌ర‌లించి, అక్క‌డ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. త‌రువాత త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని నారాయ‌ణగూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేసి, న‌యా నాట‌కానికి తెర‌లేపాడు.

ఇది కూడా చదవండి: ఊరి దత్తత వెనుక మహేష్ స్వార్ధం దాగుందా!?

త‌న‌తో పాటూ ఉంటున్న బావ‌మ‌రిదిని కూడా న‌మ్మబలికాడు. సుప్రియ కుటుంబ స‌భ్యులు ఒత్తిడి చేయ‌డంతో నిజం చెప్పాడు. పోలీసులు కూడా రామ‌కృష్ణ‌ పై అనుమానంతో ఓ క‌న్నేసి, ద‌ర్యాప్తు సాగించారు.ఆఖ‌రికి విచార‌ణ‌లో నింధితుడు చెప్పిన నిజాల‌కు, ద‌ర్యాప్తులో భాగంగా ఆధారాల‌కు స‌రిపోల‌డంతో విస్తుబోవ‌డం తోటి పోలీసుల వంతైంది.

ఇది కూడా చదవండి: ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

English summary

A conistable husband killed his wife. In NIjamabad a conistable husband killed his wife and applied Drushyam movie screenplay.