ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టి షాక్ ఇచ్చిన మొసలి

A crocodile came out and knocks the door

11:14 AM ON 6th May, 2016 By Mirchi Vilas

A crocodile came out and knocks the door

ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే సంతోషిస్తాం. అలానే అనుకోకుండా వచ్చి కాలింగ్ బెల్ కొడితే.. ఆ ఆనందమే వేరు. అలా కాకుండా ఎవరూ ఉహించని అతిధి వచ్చి కాలింగ్ బెల్ కొడితే..? ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాల్సిందే. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్ కరోలినాలోని ఓ ఇంటికి ఓ ఊహించని అతిధి వచ్చింది. అవును.. ఎవరూ ఊహించని అతిధి వచ్చి కాలింగ్ బెల్ కూడా కొట్టింది. ఇంతకీ ఆ ఊహించని అతిధి ఎవరంటే.. 'పెద్ద మొసలి'. కరోలినాలోని ఓ మడుగు నుంచి ఓ పెద్ద మొసలి జనావాసంలోకి వచ్చి.. ఓ ఇంటి గేటు ద్వారా.. తలుపు వద్దకు చేరుకుంది.

అంతటితో ఆగకుండా.. ఎంతో అలవాటున్న చుట్టంలా నేరుగా డోర్ దగ్గరకెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. మాములుగా అయితే.. ఆ సమయంలో తలుపు తీసిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించలేము. అయితే.. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. డోర్ తెరుచుకోలేదు. పొరపాటున ఎవరైనా ఉండి ఉంటే.. అంతే సంగతులు. ఈ తతంగాన్నంతా ఆ ఇంటి పక్కన ఉండే వ్యక్తి గమనించి.. తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఈ వీడియో లైక్ కు, షేర్ లతో సోషల్ మీడియా లో దూసుకుపోతుంది. ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

A crocodile came out and knocks the door