మొదటి భార్యని చంపేసి.. 16ఏళ్ళు శిక్ష అనుభవించి.. బయటకొచ్చి ఏం చేసాడంటే..

A crual husband killed his first wife and went to jail

05:34 PM ON 24th September, 2016 By Mirchi Vilas

A crual husband killed his first wife and went to jail

రాక్షసుడు... కిరాతకుడు.. ఇలా ఎన్ని అన్నా తక్కువే. గర్భిణీతో ఉన్న మొదటి భార్యని హత్య చేసి.. 15 ఏళ్ళు శిక్ష అనుభవించి.. బయటకు వచ్చి ఆ కిరాతకుడు ఏం చేసాడో తెలిస్తే నిజంగా ఛీ కొడతారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలో డెట్రాయిట్ పోలీసులకు 1991లో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి తన భార్యను చంపేశానని చెప్పి ఫోన్ పెట్టేసాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి జార్జ్ గ్రీన్ అక్కడే ఉన్నాడు. అప్పుడామె ఆరు నెలల గర్బిణి. ఈ కేసులో అతనికి 16 సంవత్సరాల శిక్ష పడింది. పూర్తి శిక్ష, ఆపై జైల్లో చేసిన నేరాలకు అదనపు శిక్ష అనంతరం 2008లో బయటకు వచ్చి.. 2010లో ఫెయిత్ అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

అప్పటికే ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలుండగా, తను ఇద్దరు పిల్లల్ని కన్నాడు. గత నెలలో రెండో బిడ్డ పుట్టిన సందర్భంగా పార్టీ కూడా చేసుకున్నారు. అయితే.. అంతకుముందే విడాకులు కావాలని కోర్టులో గ్రీన్ పిటిషన్ దాఖలు చేశాడు. బుధవారం రోజు విడాకులు కూడా లభించాయి. విడాకులు లభించిన రోజు రాత్రి పోలీసులకు మరోసారి ఫోన్ చేసాడు. తన భార్య సహా కుటుంబం మొత్తాన్ని(భార్య, నలుగురు పిల్లలు) హత్య చేశానని చెప్పాడు. కారణాలు మాత్రం చెప్పని గ్రీన్, శిక్షకు సిద్ధమన్నాడు. ఇల్లాలి గృహహింసే దీనికి కారణమని భావిస్తున్నామని.. ఈ కేసులో అసలు నిజం వేరేదేమైనా ఉందా? అన్న కోణంలో దర్యాఫ్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary

A crual husband killed his first wife and went to jail