ఆడపిల్ల పుట్టిందని టవల్ లో చుట్టేసి.. వదిలి వెళ్లిపోయారు

A cruel parents left their daughter in towel

11:24 AM ON 31st August, 2016 By Mirchi Vilas

A cruel parents left their daughter in towel

ఈ దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్నా కొందరికి జ్ఞానోదయం కలగడం లేదు. అసలు నిజం చెప్పాలంటే, ఆడపిల్లలు మన దేశ గౌరవాన్ని విదేశీ వేదికలపై నిలబెడుతున్నారు. పురుషులతో సమానంగా అన్నీ రంగాలలో విశేషంగా రాణిస్తున్నారు. అయినా, సరే ఇవేమి సమాజంలో ఆడపిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచలేకపోతున్నాయి. తిరుపతిలో జరిగిన ఈ ఘటన కంటతడిపెట్టిస్తోంది. ఏ తల్లి కన్నబిడ్డో.. కారణాలేమో కానీ రెండు నెలలలోపు ఆడశిశువును రుయాస్పత్రిలో వదిలి వెళ్లారు. తిరుపతిలో రుయాస్పత్రి అత్యవసర భవనం ప్రాంగణంలోని ఏఎంసీ వార్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రెండు నెలల పసికందును టవల్ లో చుట్టిపెట్టి వదిలేసి వెళ్లిపోయారు.

మంగళవారం సాయంత్రం పసికందు ఏడవటంతో రోగుల సహాయకులు, ఆస్పత్రి సిబ్బంది గుర్తించి చిన్నారి తల్లిదండ్రుల కోసం గాలించారు. ఎంతకీ వారి ఆచూకీ లేకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధా నాయక్, సీఎస్ఆర్ ఎంవో డాక్టర్ ఆర్ఆర్రెడ్డి స్పందించి శిశువుకు వైద్యపరీక్షలు చేయించి చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఎవరో బిడ్డను ఉద్ధేశపూర్వకంగా వదిలి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఎన్ఐసీయూ విభాగంలో చంటిబిడ్డకి వైద్యసేవలు అందిస్తున్నామని, దీనిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డాక్టర్ ఆర్ఆర్రెడ్డి చెప్పారు.

వైద్యసేవలు పూర్తయిన తర్వాత చిన్నారిని శిశువిహార్ అధికారులకు అప్పగించనున్నారు. బిడ్డ ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉంది. బహుశా ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌ హోస్టెస్‌ ని వేధించిన క్యాబ్ డ్రైవర్

ఇది కూడా చదవండి: శ్రీకృష్ణుడు విగ్రహం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది(వీడియో)

ఇది కూడా చదవండి: సచిన్‌తో పవన్, రేణు!

English summary

A cruel parents left their daughter in towel. In Tirupati a cruel parents left their baby in towle and gone away.