న్యూడ్ సెల్ఫీ దిగి లవర్ కి పంపబోయి తండ్రికి పంపేసింది.. తరువాత..

A daughter sends abused selfie to her father

05:27 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

A daughter sends abused selfie to her father

ఒకప్పుడు కళ్ళతోనే ప్రేమించుకునే వారు.. ఒకరినొకరు మాట్లాడుకోవడానికి ఎన్నో రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఒక అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకోవడానికి సోషల్ మీడియా వేదికైంది. ఫేస్ బుక్, వాట్సాప్ అంటూ అందులోనే మెసేజ్ లు, ఫోటోలు పంపుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. మరికొంతమందైతే ఒక అడుగు ముందుకేసి ఏకంగా న్యూడ్ సెల్ఫీలు దిగి బాయ్ ఫ్రెండ్ కి పంపిస్తున్నారు. అయితే ఇలా చెయ్యడం వల్ల అమ్మాయిలు తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేమించిన అబ్బాయి మంచివాడైతే ఆ ఫోటోలను చూసి వెంటనే డిలీట్ చేసేస్తాడు లేదా తాను మాత్రమే చూసుకోవడానికి భద్రంగా దాచుకుంటాడు. అదే చెడ్డవాడైతే తన స్నేహితులకి పంపి పైశాచిక ఆనందం పొందుతాడు.

ఆ అబ్బాయి స్నేహితులు ఇంకో పది మందికి పంపుతాడు. ఆ ఫోటోలు అలాఅలా మొత్తం వ్యాపిస్తాయి. ఆ తరువాత ఆ అమ్మాయి కుటుంబం తలెత్తుకోలేదు. ఆత్మహత్య చేసుకుంటుంది. వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకు యూట్యూబ్ ఛానల్ వారు ఒక చిన్న షార్ట్ ఫిలిం రూపొందించారు. ఆ షార్ట్ ఫిలింలో ఒక అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ బాత్ రూమ్ లోకి వెళ్తుంది. అదే సమయంలో తన ప్రియుడు తనకి నగ్న ఫోటోలు పంపమంటూ మెసేజ్ పెడతాడు. మొదట అందుకు ఒప్పుకోని ఆ అమ్మాయి ఆఖరకు ఒప్పుకుని న్యూడ్ సెల్ఫీ దిగి సెండ్ చేస్తుంది. అయితే ఇక్కడే ఆ అమ్మాయి ఒక తప్పు చేస్తుంది.

అదేంటంటే.. ఆ ఫోటో తన బాయ్ ఫ్రెండ్ కి పంపబోయి తన తండ్రికి పంపించేస్తుంది. అది చూసి షాకైన తండ్రి.. కూతురిని పిలిచి చివాట్లు పెడతాడు.. తల్లికి పంపి నీకు బుద్ధి చెప్పిస్తానంటూ ఆ ఫోటోలు తన భార్యకి పంపబోయి వాట్సాప్ గ్రూప్ లో పెడతాడు. అంతే ఆ గ్రూప్ లో వున్న వాళ్లంతా ఆ ఫోటోని చూసి మనోడికి చుక్కలు చూపిస్తారు. మొత్తానికి ఒక సందేశాత్మక చిత్రంగా ఈ షార్ట్ ఫిలిం రూపొందింది. కాబట్టి అమ్మాయిలు ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఆ షార్ట్ ఫిలిం పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

A daughter sends abused selfie to her father