ఆఫీస్ బాయ్ కి ఐటీకి కట్టాల్సింది ఎంతో తెలిస్తే షాకవుతాం

A Delhi Office Boy Shocked With The Notices issued By IT Department

11:16 AM ON 20th December, 2016 By Mirchi Vilas

A Delhi Office Boy Shocked With The Notices issued By IT Department

బడా వ్యాపారులు కూడా కట్టని పెద్దమొత్తం ఓ ఆఫీసు బాయ్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐటీ శాఖనుంచి నోటీసు కూడా వచ్చింది. అయితే ఈనోటీసు చూసి ఆఫీసు బాయ్ కి కళ్ళు తిరిగాయి. అవును, రూ.5.4 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఐటీ శాఖ నుంచి వచ్చిన నోటీసులు చూసి గణేశ్ దేవి నగర్ అనే ఓ మురికివాడలో నివసించే రవి జైశ్వాల్ (32) అనే యువకుడు షాక్ తిన్నాడు. అంతేకాదు... ఆదాయపన్నుశాఖ పంపిన నోటీసుల ప్రకారం అతడు నాలుగు కంపెనీలకు యజమాని కూడానట. అందుకే కంగారుగా ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్ కి పరుగెట్టాడు. ఇందులో తనకేపాపం తెలియదంటూఎస్పీ మహేష్ పాటిల్ ముందు ఆ యువకుడు గోడువెళ్లబోసుకున్నాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు అసలు విషయం ప్రకటించారు.

రవి జైశ్వాల్ పాన్ కార్డు, ఆధార్ కార్డులను ఉపయోగించుకుని కొందరు నాలుగు బోగస్ కంపెనీలను తెరిచినట్టు గుర్తించారు. తాను 2008లో రాజేశ్ అగర్వాల్ అనే చార్టెడ్ అకౌంటంట్ కి చెందిన కంపెనీలో చేరాననీ... జీతం కోసం బ్యాంకు ఖాతా తెరవాలంటూ తన ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నారని రవి పోలీసులకు తెలిపారు. అయితే బ్యాంకు ద్వారా తనకు జీతమివ్వలేదనీ చేతికే ఇచ్చేవారని చెప్పాడు. 2012లో అక్కడ ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరానన్నాడు. దర్యాప్తు అనంతరం పోలీసులు అగర్వాల్ తో పాటు అతని వ్యాపార భాగస్వామి రాజీవ్ గుప్తా, అగర్వాల్ ఉద్యోగులు జుగులేశ్ గుప్తా, సంతోష్ సింగ్ లను అరెస్టుచేశారు. అక్రమార్జన కోసం వీరు జైశ్వాల్ పేరిట నాలుగు బోగస్ కంపెనీలు సృష్టించారు. థానే కోర్టు వీరిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇవి కూడా చదవండి: కేంద్ర తాయిలాలతో పండగేనా ?

ఇవి కూడా చదవండి: ప్రముఖ బిలియనీర్ కూతురు కొన్న బిల్డింగ్ ఖరీదు తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

English summary

An Office boy Named Ravi Jaiswal was shocked by the notices he received form IT Department. He got notices by asking him to pay 5.4 crores of money as tax. He shocked with the notices and he complained in a near by police station and he came to know the actual reason he received notices from IT department.