భార్యను చంపేసి... శవంపై మూడుగంటల పాటు ఏమి చేసాడంటే ...

A Dentist In Mumbai Kills His Wife And Sit On The Dead Body For Three Hours

11:04 AM ON 13th December, 2016 By Mirchi Vilas

A Dentist In Mumbai Kills His Wife And Sit On The Dead Body For Three Hours

మానవత్వం అడుగంటి పోతోంది. పెద్దగా కారణం లేకుండానే మర్డర్ లు చేసేస్తున్నారు. ఇక మహిళలపై అత్యాచారాలకు కొదవలేదు. నిత్యం ఎక్కడో అక్కడ దారుణ ఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా ఆర్థిక రాజధాని ముంబైలో భయంకరమైన దారుణం జరిగింది. కేవలం ఆర్థిక వ్యవహారాల్లో తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యను భర్త కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని డాక్టర్ బబోల్ వృత్తిరీత్యా డెంటిస్ట్. జోగేశ్వరి ప్రాంతంలో ఓ చిన్న డెంటల్ క్లినిక్ నడుపుతూ, మతుంగలోని కోహినూర్ టవర్స్ లో నివాసముండేవాడు. ఆదివారం భార్య తనూజతో బబోల్ గొడవపడ్డాడు. ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఆవేశంతో బబోల్ తనూజను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహంపై మూడు గంటల పాటు అలానే కూర్చున్నాడు. పోలీసులు ఉదయం 9.30 గంటలకు విషయం తెలుసుకుని బబోల్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన జరిగినప్పుడు నాలుగేళ్ల కొడుకు పక్కనేవున్న గదిలో నిద్రపోతున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఉమేష్ ని అరెస్టు చేశారు. ఎనిమిది నెలల కిందటే గృహ హింస కింద భర్తపై తనుజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి: ఈమె నిజంగా అమ్మ కూతురేనా? ఫోటో వెనుక దాగిన అసలు రహస్యం ఇదే

ఇవి కూడా చదవండి: అమెరికాలో ‘ధృవ’ వసూళ్ల వర్షం

English summary

A Dentist in Mumbai and his wife quarreled and the dentist killed his wife with a knife and sat on the dead body for three hours. This news made sensation in Mumbai and police arrested the dentist and taken him into their custody.