ద కంజ్యూరింగ్ 2 సినిమా చూసి జడుసుకున్న కుక్క(వీడియో)

A dog afraid while watching The Conjuring 2 movie

03:57 PM ON 20th June, 2016 By Mirchi Vilas

A dog afraid while watching The Conjuring 2 movie

చాలామందికి హారర్ చిత్రాలంటే చాలా భయం. అయినా సరే కాస్త ధైర్యం చేసుకుని భయంభయంగా ఆ సినిమాని చూస్తారు. ఇంకా భయమనిపిస్తే ఆ సినిమాని చూడటం మానేస్తారు. ఆ సినిమా జోలికి అస్సలు పోరు. కానీ అందరూ అలా కాదు. హారర్ సినిమాలను ఇష్టపడే వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో మామూలు సినిమాలకంటే కూడా హారర్ సినిమాలకే డిమాండ్ ఎక్కవని చెప్పాలి. హారర్ సినిమాల్లో కనిపించే గ్రాఫిక్స్, భయపెట్టే సన్నివేశాలతో పాటు వాటికి అనుకూలంగా ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. అబ్బో ఇలా హారర్ సినిమా గురించి చెబుతూ పోతే చాలా విషయాలే ఉన్నాయి.

ప్రస్తుతం హాలీవుడ్ లో ద కంజ్యూరింగ్ 2 అనే హారర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని భయంకరమైన సన్నివేశాలను చూసినవారు కళ్లు మూసుకుంటున్నారు. మొన్నే ఈ సినిమా ధియేటర్ లో చూస్తూ 65 ఏళ్ళ వృద్ధుడు గుండె ఆగి చనిపోయిన విషయం తెలిసిందే. అంతగా ప్రజాదారణ పొందిన ఈ సినిమాలోని ఓ సన్నివేశం చూసి మనుష్యులే కాదు.. మిగతా జీవులు కూడా భయపడుతున్నాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. కంజ్యూరింగ్ 2 సినిమాను ఓ కుక్క సోఫాలో కూర్చుని చాలా శ్రద్ధగా చూస్తుంది.

అప్పుడే అందులో భయంకరమైన సీన్ ఒకటి వచ్చింది. దీంతో సౌండ్ సిస్టమ్ లో ఆ దెయ్యం సౌండ్ కు కుక్క బెధిరిపోయింది. ఇంకొక సీన్ లో భయంకరమైన అరుపులు రావడంతో కుక్కగారు జడుసుకుని తన తలను సోఫాలో దాచిపెట్టుకుంది. ఆ కుక్క ఓనర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. నెటిజన్లు ఆ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు. మరి ఆ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి..

English summary

A dog afraid while watching The Conjuring 2 movie