అద్భుతం షిరిడీలో క్యూలైన్‌లో ఉండే కుక్క!

A dog in queue line in Shirdi

12:10 PM ON 20th April, 2016 By Mirchi Vilas

A dog in queue line in Shirdi

‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అందరికీ దేవుడు ఒక్కడే అంటూ ప్రజల మధ్య ఉన్న మతబేధాలను తొలగించిన సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబా గురించి తెలియనివాళ్లు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. తన దరిచేరిన వారికి కష్టాలను దూరం చేసే సాయిబాబాను హిందూ, ముస్లిం అని తేడా లేకుండా అందరూ దర్శించుకుంటున్నారు. అలాంటి బాబాని మనుషులతో పాటు జంతువులు కూడా దర్శించుకుంటున్నాయి. నేను ఈ మధ్యే షిరిడీకి వెళ్లాను, అక్కడొక వింత గమనించాను. నిజానికి నేను వెళ్లిన ప్రతిసారి ఆ వింత చూస్తాను.. కానీ ఏరోజు నేను పట్టించుకోలేదు. ఈ మధ్యే ప్రతి విషయం గురించి పట్టించుకుంటున్నానుగా ఈసారి ఈ విషయాన్ని కూడా పట్టించుకున్నాను.

నేను ప్రతి సంవత్సరం బాబాను దర్శించుకుకోవడానికి షిరిడీ వెలుతాను.. అయితే బాబా దగ్గరికి పోయిన ప్రతిసారి బాబాను నిన్ననే చూసినట్టు అనిపిస్తుంది. అయితే నేను ఇన్ని సంవత్సరాలు వెళుతున్నా.. అక్కడ క్యూలైన్ లో ఒక కుక్క ఉందన్న సంగతి తెలుసు. అయినా దాని గురించి ఏ రోజు పట్టించుకోలేదు. అయితే ఆ కుక్క నాలుగైదు సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ క్యూలైన్ లోనే పడుకొని ఉంటుంది. ఎంత మంది ఎంత అల్లరి చేసినా అది ప్రశాంతంగా పడుకొని ఉంటుంది తప్ప ఎవరి పైనా అరవదు, కరవదు. ఇంకా చెప్పాలంటే అక్కడ కుక్క ఉన్నదన్న సంగతి ఎవరూ కూడా పట్టించుకోరు.

భక్తులు కూడా దానిని దాటుకొని వెలుతారు తప్ప.. బయటికి వెల్లగొడదామని ఎవరూ అనుకోరు. ఎందుకంటే దాని పై బాబా వారి అనుగ్రహం ఉండటం వల్లే అలా ఉందని కొందరి వాదన. మనుషులు ఋషులై ఎలాగైతే రాగ ద్వేషాలు వదిలి.. మంచి కొరకై నిశబ్దంగా ఉంటారో.. అలా ఆ కుక్క కూడా అలా మారిందని ఆ క్యూలైన్ లో నిల్చున్న ఓ వ్యక్తి నాతో అన్నాడు. ఎందుకో నిజమని అనిపించింది. కుక్కల్లో భక్తి కుక్క అని అర్ధం అయింది. అయితే మీలో ఎవరైనా ఈసారి షిరిడీ వెలితే ఈ కుక్కను చూడటం కాని, అది ఎక్కడుందని గమనించటం కాని మర్చిపోవద్దు. అది అక్కడే ఉంటుంది. ఇంకా ఎన్నో సంవత్సరాలు అలాగే బాబా సన్నిధిలో ఉండాలని కోరుకుందాం.. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై' అంటూ ఓ భక్తుడు చెప్పుకొచ్చాడు.


English summary

A dog in queue line in Shirdi. A devotional dog in Shirdi Saibaba temple. Yes it's true a dog in queue line at Shirdi Saibaba temple.