అనుమానంతో భార్యను చంపేసి.. ఆ తరువాత ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

A doubted husband killed his wife crually

12:00 PM ON 21st September, 2016 By Mirchi Vilas

A doubted husband killed his wife crually

అనుమానం ఉన్నోడితో చాలాకష్టం. వాడు సుఖంగా ఉండడు. ఎదుటివాళ్లను ఉండనివ్వడు. ఇక అనుమానపు మొగుడు మరీ ప్రమాదం. ఏది చేసేయ్యడానికైనా వెనుకాడడు. అలాగే ఓ అనుమానపు మొగుడు భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను చంపి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టేసాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగింది. సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నావల్ ఘడ్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల ప్రదీప్ కుమార్ 22 ఏళ్ల నిర్మలాదేవిని పెళ్లాడాడు. కొన్నాళ్ళు బానే గడిచినా, ఆతర్వాత ఆమెపై అనుమానం మొదలైంది.

అది కాస్తా పెనుభూతంగా మారింది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో ప్రదీప్ ఆమెను ఇంట్లోనే దారుణంగా హతమార్చాడు. అనంతరం భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతమైన పిప్రాలీ గ్రామ శివార్లలో పూడ్చి పెట్టాడు. తన కూతురు అల్లుడైన ప్రదీప్ వద్ద కనిపించకపోవడంతో నిర్మలాదేవి తండ్రి ఈ నెల 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఇంటరాగేషన్ లో ప్రదీప్ తన నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం చేయించారు.

English summary

A doubted husband killed his wife crually