ఎవరైనా ఫ్రిజ్ లో తినేవి పెడతారు.. కానీ వీళ్ళు ఆ మహిళను ముక్కలుగా కోసి..

A drugs group killed woman and puts her parts in refrigerator

11:46 AM ON 26th September, 2016 By Mirchi Vilas

A drugs group killed woman and puts her parts in refrigerator

నేరాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. నేర ప్రవృత్తి వృత్తిగా చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంత దారుణంగా తయారవుతోంది. అంతర్జాతీయంగా నేరాలు జరిగే తీరు చూస్తుంటే మనకు ఒళ్ళు జలదరిస్తుంది. తాజాగా థాయ్ లాండ్ లో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. థాయిలాండ్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. అయితే వారి కంటపడిన ఓ దృశ్యం ఒళ్లు జలదరింపజేసింది. ఒక మహిళను నరికి ఆ ముక్కలను నల్లటి కవర్లలో ఉంచి రిఫ్రిజిరేటర్ లో భద్రపర్చారు. తొలుత ఓ ఐదంతుస్తుల భవనంలో ఉన్న 63ఏళ్ల బ్రిటిష్ వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల అనంతరం బ్రిటిష్ వ్యక్తితో పాటు ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు బర్మావాసులను అరెస్టు చేశారు. వారి స్థావరంలో పోలీసులు భారీగా తుపాకులు, మత్తుపదార్థాలు, నకిలీ పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. భవనంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బేస్ మెంట్ లో కనిపించిన దృశ్యం నివ్వెరపర్చింది. ఓ మహిళను ఐదు ముక్కలుగా నరికి ఆ భాగాలకు నల్లటి కవర్లో చుట్టి రిఫ్రిజిరేటర్లో భద్రపర్చారు. మృతురాలి విడిభాగాలకు ఇంకా దుస్తులు, బూట్లు అలాగే ఉన్నాయి. ఆమె ఎవరనేది గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అబార్షన్ తరువాత మంచి ఆరోగ్యం కోసం ఇవి తినండి..

ఇది కూడా చదవండి: అతిగా శృంగారం చేస్తే బట్ట తల, గుండె నొప్పి ఇంకా ఎన్నో ప్రమాదాలు!

ఇది కూడా చదవండి: వ్యభిచారం చేస్తున్న స్టార్ హీరోయిన్ సిస్టర్.. రోజుకి 5లక్షలు.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

English summary

A drugs group killed woman and puts her parts in refrigerator. A drugs smuggled gang killed a woman and cuts her into parts and puts her parts in refrigerator.