భార్యపై అనుమానంతో తాగొచ్చి ముక్కు కొరికేసాడు.. ఆపై..

A drunken husband bites brutally his wife's nose

11:20 AM ON 16th September, 2016 By Mirchi Vilas

A drunken husband bites brutally his wife's nose

అన్నింటి కన్నా ప్రమాదం అనుమానం... ఒకసారి మనస్సులోకి చొప్పించారో ఇక అంతే తాను బాలవ్వడమో, ఎదుటివాళ్లను బలిచేయడమో తప్పదు. అందుకే అనుమానం భూతం కన్నా భయంకరమైనది. ఒకడికి సరిగ్గా అనుమానం పెనుభూతమైంది. అది కూడా ఎవరి మీదో కాదు, భార్యపై అనుమానం పెంచుకున్న భర్త సైకోలా మారాడు. అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ దారుణ ఘటన అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే...

యూపీలోని షహజాన్ పూర్ కు చెందిన సంజీవ్ రాథోడ్, కమలేశ్ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ఆరేళ్ల పాప ఉంది. పెళ్లయిన మొదటి రోజు నుండే భార్యను అనుమానించేవాడు. ఆ అనుమానంతోనే ప్రతిరోజూ భార్యతో గొడవపడేవాడు. ఒక రోజు ఉదయన్నేఅతడి భార్య వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోంది. ఆ విషయం గమనించిన సంజీవ్ తాగొచ్చి ఆమెతో గొడవపడ్డాడు. అందంగా ఉంది కాబట్టే వేరే వాళ్లతో మాట్లాడుతుందని కాబోలని పొరబడ్డాడు.

అదే ఆమె అందవిహీనంగా ఉంటే ఈ సమస్యే ఉండదనుకొని భావించి, ఆమెతో పొట్లాడుతున్న క్రమంలో ముక్కును కొరికేశాడు. ఆమె అరుపులు కేకలు విన్న పొరుగింటి వారు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. తమ కుమార్తె ముక్కును అల్లుడు కొరికేశాడనే విషయం తెలిసిన కమలేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు. ఇక విచారణ జరుగుతోంది.

English summary

A drunken husband bites brutally his wife's nose. A husband doubted on his wife. Because she is beautiful. That's why he drunk the alcohol and came to the house. After that he bites his wife's nose brutally.