'అమ్మ' కోలుకోవాలని ఏం చేసాడో తెలుసా?

A elderly man slept on bed made of thorns

12:42 PM ON 17th October, 2016 By Mirchi Vilas

A elderly man slept on bed made of thorns

తమిళనాట ఎవరినైనా అభిమానిస్తే, వాళ్ళకోసం ఏమి చేయడానికైనా కొంతమంది అభిమానులు వెనుకాడరు. ఇప్పుడు తమిళనాడు సీఎం జయలలిత చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. అమ్మ అని ఆమెను కొలిచేవాళ్ళు ఎందరో వున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమాని, అన్నా డీఎంకె కార్యకర్త ఒకరు విచిత్రమైన సాహసానికి ఒడిగట్టాడు. మదురైకి చెందిన 68 ఏళ్ళ ఇరులంది అనే ఈ కార్యకర్త 24 గంటలపాటు ముళ్ళ శయ్య మీద పడుకుని నిద్రించాడు. తాను ఆరాధించే పెచ్చియమ్మన్ దేవతకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆయన చేసిన ఈ పని అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది.

అయిదు రకాల ముళ్ళతో తనే ఓ పడక లాంటిది చేసుకున్నాడు. వీటిలో విషపూరితమైన ముళ్ళు కూడా ఉన్నాయి. స్థానికుల్లో చాలామంది ఇరులంది అమ్మ భక్తిని, అభిమానాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఇప్పటికే వీపులకు ఇనుప శూలాలు గుచ్చుకుని కొంతమంది ప్రార్థనలు చేయగా ఇక ప్రత్యేక పూజలు, హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

1/3 Pages

1. ఇక అమ్మకు సింగపూర్ థెరపీ..


ఇక జయలలితకు ఫిజియో థెరపీ చేసేందుకు సింగపూర్ నుంచి ఇద్దరు డాక్టర్లు ఆదివారం చెన్నై చేరుకోనున్నారు. సింగపూర్ లోని క్వీన్ ఎలిజెబెత్ ఆసుపత్రికి చెందిన వీరు.. జయకు అందుతున్న చికిత్సలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు, లండన్ నుంచి వచ్చిన వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు కొనసాగిస్తున్నారు.

English summary

A elderly man slept on bed made of thorns