నిద్రలోనే మృత్యువు కబళించింది.. ఐదుగురి మృతి!

A family died in sleep

03:28 PM ON 27th July, 2016 By Mirchi Vilas

A family died in sleep

ఎంత జాగ్రత్తాగా వున్నా ఒక్కోసారి, అనుకోని ప్రమాదం ముంచుకొస్తుంది. రోడ్డుమీదే కాదు ఇంట్లో వున్నా ప్రమాదం ఎదో రూపంలో తరుముకొచ్చి మృత్యువు కబళిస్తుంది. అందుకు తాజాగా జరిగిన ఈ దారుణమే నిదర్శనం. ఇంట్లో ఉక్కపోతతో అందరూ ఆరుబయట పడుకున్నారు. చినుకులు పడుతుండడంతో తిరిగి ఇంట్లోకి వెళ్లారు. అదే వారి పాలిట శాపంగా మారింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చౌడు మిద్దె పైకప్పు ఉన్నఫళంగా దూలాలతో సహా కూలిపోయింది. నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఇంతకీ ఇది ఎక్కడంటే, కడప జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం దళితవాడలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

కూలి పనులు చేసుకుంటున్న అంగంపల్లి చినగుర్రప్ప(50), భార్య పెంచలమ్మ(42), చిన్న కుమార్తె హరిత(23), మనవళ్లు యశ్వంత్(6) నవనీత్(3) మృతి చెందినవారిలో ఉన్నారు. ఆయన పెద్దకుమార్తె లలిత, చిన్నకుమార్తె హరిత కూతురు నిహారిక(11 నెలల బిడ్డ) ప్రమాదం నుంచి బయటపడ్డారు.

1/5 Pages

పుట్టింటి చీర కట్టుకుందామని...


గుర్రప్ప చిన్నకూతురు హరితకు ఇద్దరు పిల్లలు.. నవనీత్(3), నిహారిక(11 నెలల పసికందు) ఉన్నారు. ఆమె ఇటీవలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. పుట్టింట్లో నిద్ర చేసి, పుట్టింటి చీర కట్టుకొని వెళదామని వచ్చింది. అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో హరిత, ఆమె కుమారుడు నవనీత్ దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ ఘటనలో 11 నెలల చిన్నారి నిహారికకు మాత్రం ఎటువంటి గాయాలూ కాకపోవడం ఆశ్చర్య పరిచింది.

English summary

A family died in sleep