డిక్టేటర్ టికెట్ మూడున్నర లక్షలా??

A fan bought Dictator ticket for 3.6 lakhs

05:09 PM ON 8th January, 2016 By Mirchi Vilas

A fan bought Dictator ticket for 3.6 lakhs

నందమూరి బాలకృష్ణ నటించిన 99వ చిత్రం 'డిక్టేటర్'. 'లౌక్యం' ఫేమ్ శ్రీవాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్‌న్యాషనల్ సంస్థ మరియు శ్రీవాస్ సంయుక్తంగా నిర్మించారు. బాలకృష్ణ సరసన అంజలి, సోనల్ చౌహాన్, అక్ష కధానాయికులగా నటించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే శ్రోతలని అలరించాయి. ఈ చిత్రం విడుదల కాకముందే ఎన్నో సంచలనాలని సృష్టించింది. తాజాగా డిక్టేటర్ మరో సంచలనానికి తెర తీసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతున్న ఈ చిత్రం రైట్స్ అమ్మకాలు ఇప్పటికే భారీ మొత్తంలో అమ్ముడైపోగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు కొన్ని చోట్ల జోరుగా సాగిపోతున్నాయి.

ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం టిక్కెట్లు అమ్మకం జరుగుతున్నాయి. ఓవర్‌సీస్ అయిన యూఎస్ లో ఒక అభిమాని డిక్టేటర్ మొదటి టిక్కెట్ ని ఏకంగా 5555(3.6 లక్షలు) డాలర్లకి కొనుక్కున్నాడు. బాలయ్య కెరీర్ లోనే అత్యంత వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం టిక్కెట్లు కూడా అంతే వ్యయంతో కొనుక్కుంటున్నారు. లెజెండ్ చిత్రానికి ఒక రాయలసీమ అభిమాని 40,000 పెట్టి టికెట్ కొంటే ఇప్పుడు ఏకంగా 3.6 లక్షలు పెట్టి టికెట్ కొని రికార్డ్ సృష్టించాడు.

English summary

A fan bought Dictator first ticket for 3.6 lakhs in US. It is the record in Balakrishna carrier.